టాలీవుడ్ ఇండస్ట్రీ తో పాటు యావత్ భారతదేశ సినిమా ఇండస్ట్రీలో తనకంటూ సపరేట్ క్రేజ్ ఏర్పరుచుకున్నాడు దగ్గుబాటి రానా. ముఖ్యంగా బాహుబలి సినిమాలో విలన్ పాత్రలో నటించి ప్రపంచవ్యాప్తంగా పాపులారిటీ సంపాదించుకున్నారు. ఒక్క సౌత్ సినిమాలే కాకుండా బాలీవుడ్ ఇండస్ట్రీలో కూడా సినిమాలు చేస్తున్నా రానా త్వరలో ఓ భారీ సినిమా లో గెస్ట్ రోల్ పాత్రకి ఒప్పుకున్నట్లు టాలీవుడ్ ఇండస్ట్రీలో వార్తలు వినబడుతున్నాయి.


ఇంతకీ విషయంలోకి వెళితే హోమ్ బ్యానర్ సురేష్ ప్రొడక్షన్ నిర్మిస్తున్న వెంకీ మామ సినిమాలో దగ్గుబాటి రానా నటించడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు ఈ సినిమాలో గెస్ట్ రోల్ లో కనిపించనున్నట్లు ఫిలింనగర్ టాక్. గతంలో ఒకానొక సమయంలో క్రిష్ డైరెక్టర్ గా చేసిన కృష్ణం వందే జగద్గురం సినిమాలో ఒక సాంగ్ లో వెంకటేష్ తో కలిసి స్టెప్పులు వేసిన రానా...వెంకీ మామ సినిమాలో మాత్రం కొద్దిసేపు హీరో వెంకటేష్ తో కలిసి నటిస్తున్నట్లు సమాచారం.


అంతేకాకుండా ఈ సినిమా ప్రత్యేకత ఏమిటంటే వాస్తవ జీవితంలో బంధుత్వ పరంగా మేనమామ అయిన వెంకటేష్ తో కలిసి నటిస్తున్నాడు నాగచైతన్య. దీంతో ఈ సినిమాపై అంచనాలు విపరీతంగా ఉన్నాయి. గత కొంత కాలం నుండి సినిమా ఆలస్యం అవుతున్న క్రమంలో తాజాగా విడుదల చేయటానికి సిద్ధంగా ఉన్నట్లు కొద్దిపాటి షూటింగ్ మినహా ఈ సినిమా మొత్తం పూర్తి అయినట్లు ఫిలింనగర్ టాక్. రియల్‌ లైఫ్‌లో మాదిరిగానే ఈ సినిమాలో కూడా మామా అల్లుళ్లలా నటిస్తున్నారు వెంకీ, నాగచైతన్య. రైతు పాత్రలో వెంకటేశ్, ఆర్మీ ఆఫీసర్‌గా నాగచైతన్య కనిపిస్తారని ప్రచారం జరుగుతోంది. ఈ సినిమాకు తమన్‌ సంగీతం అందిస్తున్నారు. 



మరింత సమాచారం తెలుసుకోండి: