విజయ దేవరకొండ ఒక సెన్సేషనల్ హీరో అని చెప్పాలి. తక్కువ టైం లో యూత్ లో విపరీతమైన ఫాలోయింగ్ ను సంపాదించారు. అయితే పైకి ఎవ్వరూ పెదవి విప్పకపోయినా, నిన్నటికి నిన్న విజయ్ దేవరకొండ లేటెస్ట్ సినిమా డియర్ కామ్రేడ్ ఫలితం చూసి, టాలీవుడ్ లో మూడువంతుల మంది చంకులు గుద్దుకున్నారన్నది నమ్మి తీరాల్సిన నిజం. పైకి ఎవ్వరూ ఒప్పుకోకపోవచ్చు, కానీ టాలీవుడ్ ఇన్ సైడ్ సర్కిళ్లలో నిన్నటికి నిన్న జరిగింది ఇధే. విజయ్ కు ఆటిట్యూడ్ ఎక్కువ, ఇప్పటి నుంచి పవన్ కళ్యాణ్ లా ఫీల్ అయిపోతున్నాడు, అతి తగ్గించుకోవాలి.


ఆ మ్యూజిక్ ఫెస్టివల్స్ అంటూ అంత హడావుడి ఏమిటి? అయినా నాలుగు భాషల్లో అప్పుడే ఎంట్రీ అవసరమా? ఇలా ఒకటికాదు, రెండుకాదు, ఎన్ని కామెంట్ లు వినిపించాయో? ఈ కామెంట్లకు తగినట్లేవుంది విజయ్ వ్యవహారం కూడా. మీడియా మీద సెటైర్లు వేయడం, ప్రెస్ మీట్ లో మీడియాతో ముచ్చటించినపుడు వెటకారంగా మాట్లాడడం, తమిళ, మలయాళ, కన్నడ వెర్షన్ కు విపరీతమైన ప్రాధాన్యత ఇచ్చి, తెలుగులో ఒక్క న్యూస్ చానెల్ కు కానీ, ఎవరికీ కానీ ఎటువంటి ఇంటర్వూలు ఇవ్వకపోవడం, ఇలా అన్నివిధాలా అన్ని వర్గాలను విజయ్ దూరం చేసుకుంటున్నట్లు కనిపిస్తోంది.


సినిమారంగంలో అందరి హీరోలతో సినిమాలు చేస్తున్న ఓ పెద్ద ప్రొడ్యూసర్, ఇండస్ట్రీ కీలకవ్యక్తి విజయ్ తో కూడా సినిమా చేద్దామని అడిగితే, ఎస్ ఆర్ నో చెప్పకుండా రోజుల తరబడి తిప్పించుకుంటున్నట్లు తెలుస్తోంది. దీంతో ఆయన విసిగిపోయి, ఇలా ఏ హీరోను చూడలేదు ఇంతవరకు అని కామెంట్ చేసినట్లు తెలుస్తోంది. అయితే  ఉదయ్ కిరణ్, తరుణ్ నుంచి టాప్ లైన్ వరకు అందరూ ఒక స్టేజ్ లో సర్రున లేచినవారే. కానీ నిలబడ్డవాళ్లు, నిలబెట్టుకున్నవాళ్లు, నిలదొక్కుకున్నవాళ్లు కొద్దిమందే. అలాంటి వాళ్ల వెనుక వాళ్ల ప్లానింగ్, వ్యవహార శైలి, ఇతరత్రా వ్యవహారాలు వుంటాయి. 

మరింత సమాచారం తెలుసుకోండి: