తెలుగు వాడైనా తమిళ పరిశ్రమలో స్టార్ డమ్ ని సంపాదించుకున్నాడు విక్రమ్. శంకర్ లాంటి స్టార్ డైరెక్టర్ తో సినిమాలు చేసే గొప్ప అవకాశాన్ని పొందాడు. అంతేకాదు కోలీవుడ్ లో స్టార్ డమ్ అనే చట్రం లో ఇరుక్కోకుండా కథను నమ్మి సినిమాలు చేసే అతి కొద్దిమంది హీరోలలో విక్రమ్ ఒకరుగా అద్భుతమైన క్రేజ్ ను సంపాదించుకున్నాడు. హిట్స్, ప్లాప్స్ తో సంబంధం లేకుండా వైవిధ్యం కోసం ఎంతగానో తపిస్తారు. అవసరమైతే చివరకు తను ఎంచుకున్న పాత్ర కోసం శరీరాకృతిని మార్చుకోగల దిట్ట.'ఐ' సినిమా కోసం పరిమితి కి మించి బరువు తగ్గి సినిమా కోసం ప్రాణాలు పణంగా పెట్టాడు.

ఒకరకంగా చెప్పాలంటే విక్రమ్ కు స్ఫూర్తి లోకనాయకుడు కమల్ హాసన్. కమల్ వేసిన విభిన్న గెటప్స్ , చేసిన ప్రయోగాలు మనకు తెలిసి ఇండియా లోనే కాదు, ప్రపంచం లోనే ఎవరు చేసి వుండరు. ఈ విషయాన్ని ఎవరైనా ఒప్పుకొని తీరాల్సిందే. సినిమాను వ్యాపారంగా కాకుండా కళగా భావించే స్టార్ హీరో కమల్ హాసన్. ఐతే విక్రమ్, కమల్ రికార్డుని బద్దలు కొట్టడానికి రెడీ అయ్యారని లేటెస్ట్ న్యూస్ ఒకటి సౌత్ ఫిల్మ్ ఇండస్ట్రీస్ లో చక్కర్లు కొడుతోంది. దశావతారం సినిమాలో కమల్ హాసన్ ఏకంగా 10 విభిన్న గెటప్స్ లో కనిపించి రికార్డు సృష్టించారు. ఇప్పుడు విక్రమ్ అంతకు రెట్టింపుకు పైగా, పాత్రలలో కనిపించనున్నారని కోలీవుడ్ మీడియా సమాచారం.

అజయ్ జ్ఞాన ముత్తు దర్శకత్వంలో విక్రమ్ 58 వ సినిమాగా తెరకెక్కనున్న సినిమాలో ఏకంగా 25 విభిన్న గెటప్స్ లో కనిపించనున్నారట. ఓ ప్రముఖ అమెరికన్ కంపెనీ ఇప్పటికే విక్రమ్ గెటప్స్ కి సంబందించిన డిజైన్స్ రెడీ చేస్తుందని ఫ్రెష్ అప్‌డేట్. ఇదే కనుక జరిగితే ఒక సినిమాలో ఇన్ని గెటప్స్ లో నటించిన నటుడిగా విక్రమ్ రికార్డు సృష్టించడం ఖాయమనిపిస్తోంది. 7స్క్రీన్‌ స్టూడియోస్‌, వయకామ్‌ 18 స్టూడియోస్‌లు సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమా ఆగస్టులో సెట్స్‌పైకి వెళ్లనుంది. ఏప్రిల్‌ 2020లో విడుదల చేయాలని చిత్ర బృందం సన్నాహాలు చేస్తున్నారట. అంతేకాదు ఈ సినిమాను తమిళ, తెలుగు, హిందీ భాషల్లో విడుదల చేయనున్నారని కూడా సమాచారం.     


మరింత సమాచారం తెలుసుకోండి: