నందమూరి బాలకృష్ణ కె.ఎస్. రవికుమార్ కాంబినేషన్లో ఒక చిత్రం తెరకెక్కబోతున్న విషయం తెలిసిందే. ఈ నేపధ్యంలో నిన్నటి నుంచే ఈ చిత్రానికి సంబంధించిన పిక్స్‌ను ఒక్కొక్కటిగా సోషల్ మీడియాలో ఫ్యాన్స్‌తో పంచుకుంటున్నారు. ట్రిమ్డ్ ఫ్రెంచ్ షేవ్ లో ఉన్న బాలయ్య ఫోటోని చూసిన అభిమానులు అవాక్కయ్యారు. గతంకి భిన్నంగా ట్రెండీగా కనిపించిన బాలయ్య ఫోటో చూసి వారు ఫిదా అయ్యారు. వారి ఆనందాన్ని రెట్టింపు చేస్తూ చిత్ర యూనిట్ ఈ చిత్రంలోని బాలయ్య అధికారిక లుక్ రివీల్ చేయడం జరిగింది.
బాలయ్య సూటు బూటులో టాప్ టు బాటమ్ కార్పొరేట్ బాస్ లా తయారైన ఆ లుక్ కేకపుట్టించేలా ఉంది. బాలయ్య ఈ మధ్య కాలంలో నటించిన ఏ చిత్రంలో కూడా ఇంత గ్లామర్ గా కనిపించలేదు అనేది నిజం. ప్రస్తుతం విడుదలమైన ఒక్క లుక్‌తో ఫ్యాన్స్‌ని ఆకట్టుకుంది. అదే విధంగా సినిమా పైన అంచనాలు కూడా పెంచేసింది ఆ లుక్. ఇకపోతే ఈ చిత్రంలో ఆయన సరసన వేదిక. సోనాల్ చౌహన్ నటిస్తున్నారు. సి. కళ్యాణ్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. సంక్రాంతికి వచ్చే కొత్త అల్లుడు లాగా సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి నిర్మాతలు విడుదలకు సన్నాహాలు చేస్తున్నారని సమాచారం.
ఇకపోతే ఒక ఫ్రెంచ్ గెడ్డంతో కొత్తలుక్ లో ప్రేక్షకులను ఆకట్టుకోబోతున్నారు బాలయ్య. ఆయన లుక్ ఎలా ఉందంటే చాలా యంగ్ అండ్ ఎనర్జిటిక్‌గా కనపడుతున్నారు. గత చిత్రాల లుక్స్‌తో పోలిస్తే ఆయన చాలా డిఫరెంట్‌గా ఉన్నారనే చెప్పాలి. వచ్చే సంక్రాంతి బాలయ్య ఫ్యాన్స్‌కి పండగనే చెప్పాలి. జైసింహా` వంటి సూపర్‌హిట్ తర్వాత రూపొందుతున్న చిత్రమిది. ఈ చిత్రానికి పరుచూరి మురళి కథను అందిస్తున్నారు. చిరంతన్ భట్ సంగీతం అందిస్తుండగా రామ్‌ప్రసాద్ సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. రామ్‌లక్ష్మణ్ యాక్షన్ కొరియోగ్రాఫ్ చేస్తున్నారు. చిన్నా ఆర్ట్ వర్క్‌ను అందిస్తున్నారు.