భారతీయ సినిమా పరిశ్రమలో అతి పెద్ద క్రేజీ ప్రాజక్ట్ గా రూపొందుతున్న ఆర్ఆర్ఆర్ సినిమా ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది. టాలీవుడ్ బడా స్టార్స్ యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోలుగా నటిస్తున్న ఈ సినిమాలో రామ్ చరణ్ సరసన అలియా భట్ హీరోయిన్ గా నటిస్తుండగా, ఎన్టీఆర్ సరసన హీరోయిన్ గా ఇటీవల ఒక బ్రిటిష్ నటిని ఎంపిక చేసినట్లు సమాచారం. అయితే ఈ సినిమాకు సంబంధించి కొన్ని నెలల క్రితం కేవలం ఒకే ఒక పోస్టర్ బయటకు రావడం, 

అది కూడా హీరోలిద్దరూ సగం ఫేస్ తో ఉన్న క్లోజ్ అప్ పోస్టర్ ని మాత్రమే రిలీజ్ చేసింది ఆర్ఆర్ఆర్ యూనిట్. అది ఒక్కటి తప్పించి, ఇప్పటివరకు ఈ సినిమా నుండి మరొక ఫోటో బయటకు రాలేదు. అయితే నేడు కొన్ని టాలీవుడ్ వర్గాల నుండి అందుతున్న సమాచారం ప్రకారం, అక్టోబర్ 22న ఈ సినిమాలో ఎన్టీఆర్ పోషిస్తున్న కొమరం భీం ఫస్ట్ లుక్ పోస్టర్ ను రిలీజ్ చేస్తారట. ఆ రోజు కొమరం భీం జయంతి ఉండడమే దానికి కారణం అని అంటున్నారు. దీంతో నందమూరి అభిమానులు సంబరపడుతున్నారు. మరోవైపు, ఈ సినిమా కోసం ఇద్దరు హీరోలైన చరణ్, ఎన్టీఆర్ లు కూడా ఎంతగానో కష్టపడి మాంచి ఫిజిక్ కోసం గంటల తరబడి జిమ్‌లో కసరత్తులు చేస్తున్నారు. అయితే కొమరం భీం ఫస్ట్ లుక్ విషయమై ఇప్పటివరకు ఆర్ఆర్ఆర్ టీమ్ నుండి ఎటువంటి అధికారిక ప్రకటన రానప్పటికీ, 

కొందరు రాజమౌళి సన్నిహితులు మాత్రం ఈ వార్త నిజమేనని హింట్ ఇస్తున్నారట. మరి ప్రస్తుతం పలు మీడియా మాధ్యమాల్లో విపరీతంగా ప్రచారం అవుతున్న ఈ వార్త కనుక నిజమే అయినట్లయితే, ఎన్టీఆర్ ఫ్యాన్స్ కు నిజంగా పండుగ వచ్చినట్లే. అజయ్ దేవగన్, సముద్ర ఖని తదితరులు ఇతర ముఖ్య పాత్రల్లో నటిస్తున్న ఈ సినిమాను దాదాపుగా రూ.450 కోట్ల బడ్జెట్ తో డివివి ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై దానయ్య అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. కాగా అన్ని కార్యక్రమాలు పూర్తి చేసి సినిమాను వచ్చే ఏడాది జులై 30న ఎంతో గ్రాండ్ గా రిలీజ్ చేయనున్నారు....!!


మరింత సమాచారం తెలుసుకోండి: