బిగ్ బాస్ లో మంగళవారం జరిగిన ఎపిసోడ్ లో పెద్ద రచ్చ జరిగింది. నామినేషన్ లో ఉన్న ఆరుగురు కంటెస్టెంట్స్ లో ముగ్గురు కంటెస్టెంట్స్ వాళ్ళకిచ్చిన సీక్రెట్ టాస్క్ ని విజయవంతంగా కంప్లీట్ చేసి ఎలిమినేషన్ నుండి బయట పడ్డారు. బిగ్ బాస్ తో వాళ్ళు కుదుర్చుకున్న డీల్ ప్రకారం టాస్క్ లని కంప్లీట్ చేశారు. కానీ, నామినేషన్ లో ఆరుగురిలో ముగ్గురిని సేవ్ చేయడం ఏంటని ఆశ్చర్యపోతున్నారు.


రవి,రాహుల్, వరుణ్ లు ఈ టాస్క్ లని సక్సెస్ ఫుల్ గా పూర్తి చేసినప్పటికీ, వాళ్ళు టాస్క్ చేస్తున్నారని మిగతా హౌస్ మేట్స్ కి తెలియడం వల్ల వాళ్ళు డిఫెండ్ చేయలేకపోయారు. ఒక్క రాహుల్ విషయంలో మాత్రమే డిఫెండ్ చేయడానికి హౌస్ మేట్స్ అందరూ వచ్చారు. నిజం చెప్పాలంటే బిగ్ బాస్ ఇచ్చినవి సీక్రెట్ టాస్క్ లు కూడా కాదు. దానివల్ల కంటెస్టెంట్స్ లైట్ తీసుకున్నారు. ఒక్క ఆలీ మినహాయిస్తే మిగతా వారెవరూ డిఫెండ్ చేసే ప్రయత్నమే చేయలేదు.


ఈ టాస్క్ ల ద్వారా సేవ్ అవ్వడం చూస్తుంటే ఈ వారం ఎలిమినేషన్ ఉండకపోవచ్చనే వాదన వినిపిస్తుంది. నామినేషన్స్ లో ముగ్గురు మాత్రమే ఉండడంతో అది కూడా హౌస్ లో ఆక్టివ్ గా ఉండే మహేష్, పునర్నవి, హిమజ లు కావడం వల్ల ఎలిమినేషన్ ఉండదు అని బలంగా అనిపిస్తుంది. అయితే  తర్వాతి వారం డబల్ ఎలిమినేషన్ ఉంటుందని కూడా తెలుస్తుంది. లేదంటే ఒకవేళ ఎలిమినేట్ అయినా,వారిని సీక్రెట్ రూంలో పెట్టే అవకాశం ఉంది.


ఏది ఏమైనా బిగ్ బాస్ చేసింది ఘోర తప్పిదంగా భావిస్తున్నారు. నామినేట్ చేసి, మళ్ళీ రక్షించడం ఏంటని,ఇలా చేస్తే ఓట్లు వేయడానికి ఇంట్రెస్ట్ తగ్గిపోతుందనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.మరి ఏం జరుగుతుందో ముందు ముందు ఎపిసోడ్లలో చూడాలి. 



మరింత సమాచారం తెలుసుకోండి: