అల్లు అర్జున్ ప్రస్తుతం త్రివిక్రమ్ తో చేస్తున్న "అల వైకుంఠపురములో" చిత్ర షూటింగ్ లో బిజీగా ఉన్నాడు. ఈ సినిమా టైటిల్ చాలా క్లాసీగా ఉండడంతో వీరిద్దరి కాంబినేషన్ లో మరో హిట్ పక్కా అనే వార్తలు వస్తున్నాయి. "అ" సెంటిమెంటును ఫాలో అవుతున్న త్రివిక్రమ్ ఈ సినిమాకి కూడా దాన్ని రిపీట్ చేశాడు. అయితే బన్నీ ఈ సినిమా తర్వాత ఖాళీ లేకుండా తర్వాతి చిత్ర షూటింగ్ లో బిజీగా గడపనున్నాడు.


నా పేరు సూర్య తర్వాత బన్నీకి సినిమా చేయడానికి చాలా టైం పట్టింది. ఈ సంవత్సరంలో అసలే సినిమా రిలీజ్ అవలేదు. చాలా గ్యాప్ వచ్చేసింది. అందుకే అల వైకుంఠపురములో తర్వాత "ఐకాన్ చిత్రానికి ఏమాత్రం ఆలస్యం చేయదలచుకోలేదట. ఈ సినిమాకి సంబంధించిన స్క్రిప్ట్ పనులు పూర్తయ్యాయి. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉన్నారు. ఐకాన్ చిత్రానికి "ఎమ్ సి ఎ" ఫేమ్ వేణు శ్రీరామ్ దర్శకత్వం వహిస్తున్నారు.


ఈ ఏడాది నవంబరు నుండి ఈ చిత్ర షూటింగ్ జరుపుకోనుందట.దిల్‌రాజు నిర్మించబోతున్న ఈ చిత్రంపై అంచనాలు భారీగా ఉన్నాయి. వచ్చే ఏడాది వేసవి కానుకగా ఈ చిత్రంను విడుదల చేయాలని నిర్ణయించారు.ఐకాన్‌ చిత్రంలో హీరోయిన్స్‌ ఎవరు అనే చర్చ జరుగుతోంది. ఒక హీరోయిన్‌గా రష్మిక నటించే అవకాశం ఉందని తెలుస్తోంది. మరో హీరోయిన్‌ ఎంపిక విషయంలో చర్చ జరుగుతోంది.


ఇక ఇదే సమయంలో ఐకాన్‌కు సంగీత దర్శకుడిగా తమిళ సంగీత దర్శకుడు అనిరుధ్‌ను ఎంపిక చేయడం జరిగింది. ఈమద్య కాలంలో తెలుగులో అనిరుధ్‌ చాలా బిజీ అవుతున్నాడు. ఒక్కటి కూడా బ్లాక్‌ బస్టర్‌ పడకున్నా కూడా ఈయన మాత్రం తెలుగులో వరుసగా చిత్రాలు చేస్తూనే ఉన్నాడు. ఐకాన్‌కు అప్పుడే అనిరుధ్‌ వాయింపు మొదలు పెట్టినట్లుగా సమాచారం అందుతోంది.



మరింత సమాచారం తెలుసుకోండి: