భారీ అంచనాల మధ్య ప్రభాస్ నటించిన ‘సాహో’ సినిమా విడుదల అయ్యి మొట్ట మొదటి రోజే డిజాస్టర్ టాక్ సొంతం చేసుకుంది. అందరూ అనుకున్నట్టుగానే ఇది జరిగింది. ఎందుకంటే రాజమౌళి దర్శకత్వంలో సినిమా హిట్ కొట్టిన తర్వాత మళ్లీ అదే స్థాయిలో హిట్టు కొట్టాలని చాలా మంది హీరోలు ప్రయత్నించిన అది జరగలేదు. రాజమౌళి దర్శకత్వంలో చేసిన సినిమా చూసిన తర్వాత సదరు హీరో అభిమానులు అదే స్థాయిలో తర్వాత సినిమా కూడా ఉండాలని భావిస్తారు. అయితే రాజమౌళి చూపించినట్టుగా హీరోలను మరో దర్శకుడు చూపించడంలో ఇప్పటి వరకు చాలా మంది విఫలమయ్యారు.


ఇందుమూలంగా గతంలో చత్రపతి సినిమా చేసిన ప్రభాస్ ఆ స్థాయిలో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టడానికి అనేక కష్టాలు పడ్డాడు. ‘ఛత్రపతి’ తర్వాత ప్రభాస్ నటించిన ప్రతి సినిమా ఫ్లాప్ అవ్వడం జరిగాయి. ఇటువంటి తరుణంలో ‘చత్రపతి’ స్థాయిలో రాజమౌళి కాక మరొక డైరెక్టర్ ప్రభాస్ ని చూపించారు అంటే అది కేవలం ఒకే ఒక్క బ్లాక్ బస్టర్ డైరెక్టర్ కొరటాల శివ. ప్రభాస్ తో కొరటాల శివ చేసిన మిర్చి సినిమా అప్పట్లో సూపర్ డూపర్ హిట్ అయింది. ఈ సినిమా చూసి చాలా మంది ప్రభాస్ అభిమానులు ఇండస్ట్రీకి చెందినవారు ప్రభాస్ ని సిల్వర్ స్క్రీన్ పై ఏవిధంగా చూపించాలో ఆ విధంగా డైరెక్టర్ కొరటాల శివ చూపించడం జరిగింది అని కామెంట్ చేయడం జరిగింది.


ఇదిలా ఉండగా ప్రస్తుతం ప్రభాస్ కెరియర్ మంచి గ్రాఫ్ మీద ఉన్న తరుణంలో ‘సాహో’ సినిమాతో ఫ్లాప్ తన ఖాతాలో వేసుకోవడం తో ప్రభాస్ కెరియర్ కి అప్పుడే డౌన్ ఫాల్ వస్తున్న తరుణంలో ఇటువంటి సమయంలో కొరటాలతో సినిమాకి సంతకం పెట్టకపోతే ప్రభాస్ ముందు ముందు చాలా ఇబ్బందులు ఎదుర్కోవటం ఖాయమని అంటున్నారు. అంతే కాకుండా ఇటీవల కొరటాల ప్రభాస్ కి సినిమాకి సంబంధించిన ఓ లైన్ కూడా వినిపించినట్లు చిరంజీవి సినిమా తర్వాత ఆ సినిమా చెయ్యాలనే ఆలోచనలో కొరటాల ఉన్నట్లు ఫిలింనగర్ లో టాక్. మొత్తంమీద చూసుకుంటే ప్రభాస్ తన కెరియర్ పైకి తీసుకెళ్లాలంటే కొరటాల శివ తప్ప వేరొక ఆప్షన్ లేదని...ఇండస్ట్రీలో ఉన్న చాలామంది కామెంట్ చేస్తున్నారు.



మరింత సమాచారం తెలుసుకోండి: