సౌత్ ఇండస్ట్రీలోనూ ఇటు బాలీవుడ్ ఇండస్ట్రీలో తన సత్తా చాటుతోంది కాజల్ అగర్వాల్. సౌత్ ఇండస్ట్రీ లో అయితే స్టార్ హీరోయిన్ గా రాణిస్తున్న కాజల్ అగర్వాల్ దాదాపు సౌత్ లో ఉన్న స్టార్ హీరోలందరి సరసన నటించి చాలా హిట్ సినిమాలు అందుకుంది. ఇండస్ట్రీ కి ఎంతమంది హీరోయిన్ లు వచ్చినా కానీ కాజల్ అగర్వాల్ కి ఉన్న డిమాండ్ మాత్రం ఎక్కడా తగ్గడం లేదు. తెలుగు, తమిళం ఎలా ఏమీ పట్టించుకోకుండా అన్ని భాషలలో నటిస్తున్న కాజల్ అగర్వాల్ కి అవకాశాలు కూడా ఆ విధంగానే అందుతున్నాయి.


ఇటువంటి నేపథ్యంలో తాజాగా బాలీవుడ్ ఇండస్ట్రీలో బంపర్ ఆఫర్ కొట్టేసింది కాజల్ అగర్వాల్. బాలీవుడ్ ఇండస్ట్రీలో అతిపెద్ద ప్రాజెక్టుగా తెరకెక్కబోతున్న సినిమాలో టీనేజ్ అమ్మాయి గా కాజల్ అగర్వాల్ నటిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. గ్యాంగ్ స్టర్ మాఫియా కాన్సెప్ట్ తో బాలీవుడ్ లో తెరకెక్కుతున్న భారీ బడ్జెట్ మూవీ ముంబై సాగా. జాన్ అబ్రాహం - ఇమ్రాన్ హష్మీ అలాగే మరికొంత మంది ప్రముఖ బాలీవుడ్ స్టార్స్ సినిమాలో నటిస్తున్నారు. అయితే  ఈ సినిమాలో కాజల్ జాన్ అబ్రహంకి జోడిగా నటించనుంది.


ఆమె మూడు విభిన్న గెటప్పుల్లో కనిపిస్తుందని టాక్. ముఖ్యంగా అప్పుడే 16 ఏళ్ల వయసు దాటినా యంగ్ గర్ల్ గా కాజల్ కనిపించిననున్నట్లు తెలుస్తోంది. అంతే కాకుండా ఇంకా రెండు మూడు పాత్రలు కూడా ఎవరూ ఊహించని విధంగా చాలా డిఫరెంట్ గా ఉంటాయట. ఇటీవల ఈ సినిమాకు సంబంధించి షూటింగ్ ప్రారంభం కాగా రాబోయే సంవత్సరం సమ్మర్ ఎండింగ్ లో జూన్ లో సినిమా విడుదల చేయాలని భావిస్తున్నారట. మరి ఈ సినిమాలో కాజల్ అగర్వాల్ ఎంతవరకు పేరు సంపాదించుకుంటుందో చూడాలి.  



మరింత సమాచారం తెలుసుకోండి: