యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్  హీరోగా  సుజిత్ దర్శకత్వంలో   హై స్టాండ‌ర్డ్స్ టెక్నాల‌జీతో వచ్చిన  'సాహో' చిత్రం  నెగిటివ్ టాక్ తో.. నెగిటివ్ రివ్యూస్ తో మొత్తానికి రావాల్సినదానికి కంటే  ఎక్కువ చెడ్డ పేరునే సొంతం చేసుకుంది.  భారీ బ‌డ్జెట్‌తో తెర‌కెక్కించిన ఈ భారీ యాక్షన్ ఎంటర్టైనర్  ప్రభాస్ స్టార్ డమ్ పై  పెద్ద దెబ్బె కొట్టింది.  తెలుగులో ఎన్ని ప్లాప్ లు వచ్చినా.. ప్రభాస్ స్టార్ డమ్ తగ్గదు. కానీ మిగిలిన భాషల్లో అలా కాదు. సినిమా అట్టర్‌ ప్లాఫ్ అయితే.. ఆ ఎఫెక్ట్ ఆ సినిమాలో నటించిన హీరో మీద కాస్త ఎక్కువుగానే ఉంటుంది.  బాహుబలితో ప్రభాస్  ప్రపంచ రికార్డ్‌లను బద్దలు కొట్టి.. మిగిలిన బాషల్లో ప్రభాస్ అమాంతం స్టార్‌డమ్ ను  పెంచుకున్నాడు.   అయితే సాహో కథ పరంగా పవన్ కళ్యాణ్ నటించిన అజ్ఞాతవాసి కథను పోలి ఉండడం.. పైగా అజ్ఞాతవాసి కూడా  ఓ ఫ్రెంచ్ సినిమాను కాపీ చేసి ప్లాఫ్ అందుకుంది.  అయినా ఇలాంటి స్క్రిప్ట్ పై  ఇన్ని కోట్లు ఖర్చు పెట్టి ఈ సాహసం ఎందుకు చేసారో..? అనవసరంగా డబ్బు, సమయం వృద్ధా చేసారు. అన్నిటికి మించి ప్రబస్ కెరీర్ తో ఆడుకున్నారు...  సాహో సినిమా ప్లాఫ్ ద్వారా ప్రభాస్ క్రేజ్ ఇప్పటికే తగ్గింది అనడంలో ఎలాంటి సందేహం లేదు. హిందీ సోషల్ మీడియాని గమనిస్తే.. ఇప్పటికే సాహో పరిస్థితి ఏంటో అర్ధమవుతుంది.  మొత్తానికి ప్రభాస్ కి సాహో గట్టి దెబ్బే.     


కానీ  బాక్సాఫీస్ వద్ద మాత్రం సాహో  కలెక్షన్స్ పరంగా దూసుకెళ్తున్నాడు. సాహోకి వచ్చిన  టాక్ కి  వస్తోన్న కలెక్షన్స్ కి  ఏ మాత్రం సంబంధం లేదని ట్రేడ్ వర్గాలు సైతం షాక్ అవుతున్నాయి.  టాక్ తో సంబంధం లేకుండా మొదటి రోజు వసూళ్ల వర్షం కురిపించింది ఈ సినిమా.  ముఖ్యంగా  నైజాంలో, ఈ చిత్రం  మొదట 2 రోజులు కెలెక్షన్స్ అద్భుతంగా ఉన్నాయి.   శనివారం నాడు నైజాంలో  'సాహో' రూ .5 కోట్లకు పైగా థియేట్రికల్ షేర్ ను రాబట్టగా...  మొత్తం 2 రోజులకు గానూ నైజాం షేర్ రూ .14.42 కోట్లుగా ఉంది.  ఇక ఆదివారం అడ్వాన్స్ బుకింగ్స్ ఒక్కసారిగా తగ్గాయి, రేపు పండుగ కాబట్టి కలెక్షన్స్ బాగానే ఉండొచ్చు.. ఆ తరువాతే అసలు కలెక్షన్స్ ఉంటాయా అనేది అనుమానమే. ఏమైనా ప్రభాస్ తరువాత సినిమాల పైన అన్నా జాగ్రత్త పడటం మంచింది. 


మరింత సమాచారం తెలుసుకోండి: