సోమవారం జరిగిన నామినేషన్ ప్రక్రియ ఒక అజ్ఞాత వ్యక్తి ఆధ్వర్యంలో జరిగాయి. అయితే ఆ వ్యక్తి వైల్డ్ కార్డ్ ద్వారా హౌస్ లోకి అడుగుపెట్టిన శిల్పా చక్రవర్తి అని తర్వాత తెలుస్తుంది. ఈ వారం నామినేషన్ లో ఆలీ, శ్రీముఖి, రాహుల్, మహేష్, రవిక్రిష్ణలు ఉన్నారు. ఈ ఐదుగురిలో ఎవరు ఇంటి నుండి బయటకు వెళ్తారనేది హాట్ టాపిక్ గా మారింది. ఓట్ల పరంగా చూస్తే శ్రీముఖికి ఫ్యాన్ బేస్ ఎక్కువ కాబట్టి ఆమె ఎలిమినేషన్ అయ్యే ఛాన్స్ కనిపించట్లేదు.


బుల్లితెర మీద ఆమెకి ఉన్న ఫాలోయింగ్ అలాంటిది. అంతే కాకుండా టాస్క్ లలో ఆమె ౧౦౦ శాతం పర్ ఫార్మెన్స్ ఇస్తుంది. ఇక మహేష్ విషయానికొస్తే, మహేష్ కి స్వంతంగా అభిమానులు ఎక్కువ మంది లేకపోయినా, బాబా భాస్కర్ ఫాలోవర్స్ ఓట్లు మహేష్ కి పడే ఛాన్స్ ఎక్కువ. హౌస్ లో బాబా భాస్కర్ మహేష్ తోనే క్లోజ్ కాబట్టి ఆ ఓట్లు మహేష్ కి పడతాయి. ఇక రాహుల్ విషయంలో, వాళ్ళ గ్రూపు ఫాలోవర్స్ ఓట్లన్నీ రాహుల్ కే వస్తాయి.


వరుణ్, వితికా, పునర్నవి లు నామినేషన్స్ లో లేరు కాబట్టి వారి అభిమానులందరూ రాహుల్ కి ఓట్లు వేసే అవకాశం ఉంది. ఇక ఆలీ, రవిక్రిష్ణలు ఫ్రెండ్స్ అవడం వల్ల అభిమానుల ఓట్లు చీలిపోయే ప్రమాదం ఉంది.అందువల్ల ఓటింగ్ లో వీళ్ళు చివరగా ఉన్నట్టు తెలుస్తుంది. పోయిన వారం ఎలిమినేషన్ లేనందువల్ల ఈ వారం డబల్ ఎలిమినేషన్ ఉండే అవకాశం ఉంది. దాంతో వీరిద్దరు వెళ్ళిపోయే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి.


కానీ నామినేషన్ లో ఉన్న రవిక్రిష్ణ ఏదో ఒకటి చేసి స్క్రీన్ ప్రెసెన్స్ కోసం ప్రయత్నిస్తాడు. అలాగే నార్మల్ గానే తనదైన ఆటతో స్క్రీన్ లో ఎక్కువగా కనబడే ఆలీ, నామినేషన్స్ లో ఉండడం వల్ల మరింత బాగా ఆడి ప్రేక్షకుల మెప్పు పొందాలని ప్రయత్నించవచ్చు. మరి ఏం జరుగుతుందనేది ముందు ముందు చూడాలి.



మరింత సమాచారం తెలుసుకోండి: