రియల్ స్టార్ శ్రీహరి చనిపోగానే బాధతో పాటు అందరి మనసుల్లోనూ ఒక సందేహం కూడా తలెత్తింది... ఆయన స్థానాన్ని ఎవరు భర్తీ చేస్తారు అని. నిజానికి ఆయన ప్లేస్ ని రీప్లేస్ చేయడం ఎవరి వల్లా కాదు. కానీ ఏదో ఒక ఆప్షన్ అయితే వెతుక్కోవాలి కదా! మన దర్శక నిర్మాతలు అప్పట్నుంచీ వెతుకుతూనే ఉన్నారు. ఇప్పటికి ఒకరిని ఫిక్సయ్యారు. శ్రీహరి పాత్రలను ఎవరైనా చేయగలరు అంటే... అది జగపతిబాబే అని కొందరు దర్శకులు నమ్ముతున్నారు. నిజానికి మొదట సాయికుమార్, రాజశేఖర్ ల పేర్లు కూడా వినిపించాయి. అయితే అందరినీ పరిశీలించిన మీదట, ఆ పాత్రలను జగపతి బాబుకి కట్టబెట్టేందుకే మొగ్గు చూపుతున్నారంతా. ఆల్రెడీ సాయిధరమ్ తేజ చిత్రంతో పాటు మరో చిత్రంలో కూడా శ్రీహరి కోసం క్రియేట్ చేసిన పాత్రల్లో జగపతిబాబుని తీసుకున్నారు. మరికొందరు కూడా ఆ ఆలోచనలోనే ఉన్నట్లు సమాచారం. ఈ నిర్ణయం కరెక్టేనని చెప్పవచ్చు. ఎందుకంటే, జగపతిబాబు అన్ని తరహా పాత్రలూ చేయగలడు. యాక్షన్, సెంటిమెంట్, కామెడీ, విలనీ... అన్నిటినీ ప్రదర్శించిన అనుభవం అతడిది. శ్రీహరి కూడా ఏదైనా చేయగలిగేవారు కాబట్టి ఆయన పాత్రలకు జగపతి న్యాయం చేస్తాడని అనుకోవడంలో తప్పు లేదు. కాకపోతే శ్రీహరి శైలి వేరు, ఈయన శైలి వేరు. అంతే తేడా! ఒకవేళ దర్శక నిర్మాతలంతా ఈ నిర్ణయానికి వచ్చేస్తే... ఒక కొన్నేళ్ల వరకూ జగపతిబాబుకు చేతినిండా ఆఫర్లే

మరింత సమాచారం తెలుసుకోండి: