బిగ్ బాస్ త్రీ లో నలభై మూడో రోజు ఉదయం గణేశుడి పాటతో అంతా నిద్రలేచారు. వినాయక చవితి సందర్భంగా ఇంటి సభ్యులతో బిగ్ బాస్ తోరణాలు, పూలు, స్వీట్స్ పంపించాడు. ఒక్కో సభ్యుడు గార్డెన్ ఏరియాలోకి వచ్చి కెమెరా ముందు ఒక అగరబత్తి వెలిగించి మీ కోరికను తెలియజేయాలని చెప్పాడు. శ్రీముఖి అరటి ఆకుపై వినాయక చవితి శుభాకాంక్షలు రాసి చూపించింది. రాహుల్ అగరబత్తి వెలిగించి ఫ్యామిలీ మెంబర్స్ కి శుభాకాంక్షలు చెప్పాడు. ఈ ఇయర్ మిస్సయ్యానని అన్నాడు. అందరికీ మంచి జరగాలని మహేష్ కోరుకున్నాడు. హిమజ వచ్చి నాబార్డే నవంబరులో ఉంది. బిగ్ బాస్ హౌస్ లో బార్డే చేసుకోవాలనీ ఆశగా ఉందని చెప్పింది. బిగ్ బాస్ ప్రేక్షకులకు వినాయక చవితి శుభాకాంక్షలని కుటుంబ సభ్యులను మిస్సవుతున్నానని శ్రీముఖి అంది. నేను కోరుకున్నది కాకుండా నాకేది మంచిదో అదే జరగాలని కోరుకుంటున్నానని జ్యోతి అంది. అందరికీ మంచి జరగాలని పునర్ణవి కోరుకుంది. ఇంతలో బాబా మాస్టర్ వచ్చి ఈ అమ్మాయి ఎలిమినేట్ కావాలి అని అన్నాడు. తరవాత కెమెరా ముందుకు వెళ్లి తమిళ్ లో కోరుకున్నాడు. రవి, అలీని బిగ్ బాస్ కన్ ఫెషన్ రూంకు పిలిచాడు. టీవీలో చీకట్ లో ఉన్న ఒక లేడీని చూపించాడు. ఇద్దరికీ ఎవరో అర్థం కాక అలానే చూస్తూ వుండిపోయారు.


ఇంతలో ఆమె వాళ్లకే హాయ్ చెప్పింది. నేను మీకు తెలీదు కానీ మీరు మాత్రం నాకు తెలుసు అంది. అలీని బాడీ బాగా పెంచావు అంది. రవిని బుద్ద ఆఫ్ ది హౌస్ అంది. మీరు నిజంగా మాస్క్ తీయలేదు కదా అని అడిగింది. అదేం లేదని జెన్యూన్ గానే ఆడుతున్నాం అన్నారు. దానికి ఆమె ఇది కూడా నామినేషన్ లో భాగమే మీరిద్దరూ చర్చించుకొని రెండు పేర్లు చెప్పాలనీ అంతేగాకుండా బలమైన రీజన్స్ కూడా చెప్పాలని అంది. అలీ రాహుల్ పేరు చెప్పాడు. సీక్రెట్ టాస్క్ ఇచ్చినప్పుడు రాహుల్ తీరు సరిగా లేదని గేమ్ పరిధులు దాటి ప్రవర్తించాడని అన్నాడు. రవి మహేష్ పేరు చెప్పాడు. బాబా మాష్టర్ తో తప్ప అతను ఎవరితోనూ సరిగ్గా కలవడని అన్నాడు. తరవాత వితిక, పునర్నవి కన్ ఫెషన్ రూంకు వెళ్లారు. మీ యిద్దరి నవ్వు నాకు చాలా ఇష్టం అని ఆమె చెప్పింది. పునర్నవి ఫైట్ బాగుందనీ ప్రతి విషయాన్నీ వితిక భూతద్దంలో పెట్టి చూస్తోందని అంది. వితిక అలీని నామినేట్ చేస్తున్నట్లు చెప్పింది. చాలా అగ్రెసివ్ గా ఉంటాడని ఎవరు చెప్పినా వినడు అంది. పునర్నవి రవిని నామినేట్ చేస్తున్నట్లు చెప్పింది. టాస్కులను రవి నిర్లక్ష్యంగా ఆడుతాడని ఎవరితోనూ సరిగ్గా ఉండడని అంది. తరవాత హిమజ, జ్యోతి వచ్చారు. పండగ కళంతా హిమజ ముఖంలో కనిపిస్తోందని ఆమె చెప్పింది.ప్రతిదానికి ఎందుకు ఏడుస్తుంటావు అని జ్యోతి అడిగింది. హిమజ రాహుల్ నామినేట్ చేస్తున్నట్లు చెప్పింది. నోటికొచ్చినట్లు మాట్లాడతాడని గేమ్ లో ముందుకెళ్లినట్టు కనిపించలేదని అంది.



జ్యోతి మహేష్ పేరు చెప్పింది. ఎదుటివారి ప్రమేయం లేకుండా జోక్యం చేసుకుంటాడాని అంది. తర్వాత రాహుల్ మహేష్ కన్ ఫెషన్ రూంకు వచ్చారు. మహేష్ ని చాలా బాగా ఆడుతున్నావు కొందరు మాత్రం మీరు మాట్లాడటం లేదని హార్ట్ అవుతున్నారని ఆమె అంది. అందరినీ ఫాల్తూ అంటే హర్ట్ అవుతారు కదా అని రాహుల్ ను అడిగింది. టాస్క్ లో భాగంగానే అలా అనాల్సి వచ్చిందని రాహుల్ బదులిచ్చాడు. మహేష్ అలీని నామినేట్ చేద్దామనుకుంటున్నా అన్నాడు. ఎదుటివారు చెప్పిన దానిని జీర్ణించుకోలేడని చెప్పాడు. రాహుల్ శ్రీముఖి పేరు చెప్పాడు. బయట ఫ్రెండ్ గా ఉండేది ఇక్కడ శత్రువుగా తయారైంది. ఆమె అంటే పడాలి మేము ఏదైనా అంటే సీరియస్ అవుతుందని అన్నాడు. తరవాత శ్రీముఖి బాబా మాస్టర్ వచ్చారు. టీవీలో ఉన్న ఆమె ఎవరో తెలియక తికమక పడ్డారు. మీ వాయిస్ బావుందని శ్రీముఖి చెప్పింది. బాబా మాత్రం నాకు యావరేజ్ గా ఉంది అన్నాడు. తరవాత శ్రీముఖి రాహుల్ ని నామినేట్ చేస్తున్నానని చెప్పింది.



ఇమ్మ్యునిటీ టాస్క్ లో ఆయన ప్రవర్తించిన తీరు సరిగా లేదని అంది. బాబా మాస్టర్ అలీ పేరు చెప్పాడు. అతనికి కోపం చాలా ఎక్కువని అన్నాడు. ఇక ఫ్రంట్ లైటు వేస్తే మీ ఫేస్ వెళతానని బాబా ఆమెతో అన్నాడు. తరవాత వరుణ్ కన్ ఫెషన్ రూంకు వచ్చాడు. చాలా కూల్ గా గేమ్ ని ఆడుతున్నారనీ వరుణ్ణి ఆమె అంది. రవిని నామినేట్ చేస్తున్నట్లు వరుణ్ తెలిపాడు. హిమజ విషయంలో రవి తీరు నచ్చలేదని అన్నాడు. అలాగే అలీని కూడా నామినేట్ చేస్తున్నా అన్నాడు. ఇప్పటి వరకు అలీ నామినేషన్ ఎరుగడని నామినేటైతే ఎలా రియాక్ట్ అవుతాడో చూడాలని ఉందని వరుణ్ చెప్పాడు. తరవాత సభ్యులంతా హాల్ లో కూర్చుని ఉండగా సడన్ గా వైల్డ్ కార్డు ద్వారా శిల్పా చక్రవర్తి ఎంట్రీ ఇచ్చింది. నా వాయిస్ ని గుర్తుపట్టావ్ కదా అంటూ జ్యోతిని హగ్ చేసుకుంది. శ్రీముఖి రాక్షసి కచ్చితంగా గుర్తుపడుతుందనే వాయిస్ మార్చి మాట్లాడాను అంది. సభ్యులందరినీ పరిచయం చేసుకుంది. నామినేట్ చేయాలనుకుంటున్నా ఇద్దరి పేర్లు చెప్పాలని శిల్పను బిగ్ బాస్ అడిగాడు. ఒక్కసారి కూడా నామినేట్ అవ్వలేదంటూ అలీ పేరు చెప్పింది. స్ట్రాంగ్ గా ఉంటుంది కాబట్టి శ్రీముఖిని నామినేట్ చేస్తున్నా అంది. ఇంతటితో నామినేషన్ పూర్తైందని రాహుల్, అలీ, మహేష్, రవి, శ్రీముఖి నామినేట్ అయినట్లు బిగ్ బాస్ ప్రకటించాడు.


మరింత సమాచారం తెలుసుకోండి: