ఆరెక్స్ 100 సినిమాతో సెన్సేషనల్ హిట్ అందుకున్న అజయ్ భూపతి తన రెండో సినిమా కోసం చాలామంది హీరోలకు కథలు చెప్పి ఫైనల్ గా రవితేజతో సినిమా ఫిక్స్ చేసుకున్నాడు. త్వరలోనే ఈ సినిమా సెట్స్ మీదకు వెళ్లబోతుందని తెలుస్తుంది. ఇదిలాఉంటే వర్మ శిష్యుడైన అజయ్ భూపతి తన ట్విట్టర్ లో చీప్ స్టార్ అంటూ పెట్టిన ఓ మెసేజ్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.


అజయ్ భూపతి ఎవరిని ఉద్దేశించి ఆ కామెంట్ పెట్టాడు. ఏ హీరోతో అజయ్ భూపతి గొడవ జరిగింది అన్న విషయంపై ఆరా తీస్తున్నారు. వర్మ శిష్యులందరు ఒకే వరుసలో ఉంటారు. తము చెప్పాలనుకున్న పాయింట్ ఏదైనా సూటిగా సుత్తిలేకుండా చెప్పేస్తుంటారు. ఆరెక్స్ 100 సినిమాతోనే అజయ్ భూపతిలోని టాలెంట్ తెలిసింపోయింది.


కచ్చితంగా అజయ్ నుండి మంచి సినిమాలు ఆశించే అవకాశం ఉంది. అయితే సడెన్ గా ఎలాంటి క్లారిటీ లేకుండా అజయ్ భూపతి ఇలా చీప్ స్టార్ అన్న కామెంట్ పెట్టడంపై అది ఎవరిని ఉద్దేశించి పెట్టాడా అన్నది ఇప్పుడో పెద్ద ఫజిల్ గా మారింది. తనకు కాదన్న హీరోల గురించి అలా పెట్టాడా లేక మరెవరితో అయినా అజయ్ భూపతి గొడవపడ్డాడా అన్నది తెలియాల్సి ఉంది.


నిన్న పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పుట్టినరోజు కాబట్టి పవర్ స్టార్ కు బర్త్ డే విశెష్ తెలిపాడు. చీప్ స్టార్ అన్నది అతన్ని ఉద్దేశించి అయితే కాదు ఎందుకంటే పవర్ స్టార్ ఫ్యాన్స్ ను కావాలని గెలకాలని ఎవరు అనుకోరు. మరి ఇంతకీ అజయ్ దృష్టిలో చీప్ స్టార్ ఎవరు.. ఎందుకు ఆ ట్యాగ్ లైన్ ఇచ్చాడు. అయితే ఇండస్ట్రీలో ఉన్న మేథావులంతా ఇప్పుడు అజయ్ పెట్టిన చీప్ స్టార్ కామెంట్ ను డీ కోడ్ చేసే పనిలో ఉన్నారు. 



మరింత సమాచారం తెలుసుకోండి: