2008వ సంవత్సరంలో మోహన కృష్ణ ఇంద్రగంటి దర్శకత్వంలో తెరకెక్కిన అష్ట చమ్మా సినిమాతో టాలీవుడ్ సినిమా పరిశ్రమకు హీరోగా ఎంట్రీ ఇచ్చిన నాని, తొలి సినిమా తోనే మంచి విజయాన్ని దక్కించుకున్నారు. అంతక ముందుకు అసిస్టెంట్ డైరెక్టర్ గా సినిమా పరిశమలో ఆయనకు కొంత అనుభవం ఉండడం కూడా తనకు నటనలో అది కొంత ఉపకరించిందని అంటారు నాని. అక్కడినుండి నాని కి ఒక్కొక్కటిగా అవకాశాలు రావడం, వాటిని అందిపుచ్చుకుని ఆయన ముందుకు సాగడం జరిగింది. అయితే కెరీర్ పరంగా కొన్ని సక్సెస్ లతో పాటు ఫెయిల్యూర్స్ కూడా చూసిన నాని, మెల్లగా తన ఆకట్టుకునే సహజ నటనతో టాలీవుడ్ ప్రేక్షకుల నుండి నాచురల్ స్టార్ అనే పేరు సంపాదించారు. 

2010లో వచ్చిన భీమిలి కబడ్డీ జట్టు సినిమాలో నాని చేసిన సెటిల్డ్ పెర్ఫార్మన్స్ ని ఇప్పటికీ తెలుగు ప్రేక్షకులు మరిచిపోలేరు అనే చెప్పాలి. ఆ తరువాత దర్శకధీరుడు రాజమౌళి దర్శకత్వంలో నటించిన ఈగ సినిమాలో ఆయన క్యారెక్టర్ చిన్నదే అయినప్పటికీ, తన పాత్ర పరిధి మేరకు అద్భుతం నటించి ఆకట్టుకున్నారు నాని. ఆ తరువాత ఇటీవల మారుతీ దర్శకత్వంలో ఆయన హీరోగా నటించిన భలే భలే మగాడివోయ్ సినిమా, నానికి నటుడిగా యెనలేని గుర్తింపుని తీసుకువచ్చింది. అంతేకాక ఆ సినిమా సూపర్ హిట్ కావడంతో, ఆయనకు కెరీర్ పరంగా మంచి మార్కెట్ మరియు క్రేజ్ కూడా పెరిగింది. 

ఆ తరువాత జెంటిల్ మ్యాన్, నేను లోకల్, ఎంసీఏ మరియు జెర్సీ వంటి సూపర్ హిట్ చిత్రాల్లో నటించిన నాని, ఏ సినిమాకు ఆ సినిమాలో, తన ఆకట్టుకునే పెర్ఫార్మన్స్ తో ప్రేక్షకుల మనసు దోచారు. ఇక ప్రస్తుతం ఆయన హీరోగా రూపొందుతున్న గ్యాంగ్ లీడర్ సినిమా, ఈనెల 13న రిలీజ్ కాబోతోంది. ఇష్క్, 24, హలో సినిమాల దర్శకుడు విక్రమ్ కె కుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా ట్రైలర్ ఇప్పటికే రిలీజ్ అయి సినిమాపై ప్రేక్షకుల్లో మంచి క్రేజ్ తీసుకురావడం జరిగింది. ఇకపోతే నేటితో నాని, టాలీవుడ్ సినిమా పరిశ్రమకు అడుగుపెట్టి సక్సెస్ ఫుల్ గా 11 పూర్తి కావడంతో ఆయన ఫ్యాన్స్ మరియు పలువురు సినిమా ప్రముఖులు ఆయనకు సోషల్ మీడియా మాధ్యమాల ద్వారా అభినందనలు తెలుపుతున్నారు....!!


మరింత సమాచారం తెలుసుకోండి: