బిగ్‌బాస్ షో,రచ్చలో రాటుదేలిన షో,ఈ షోలోకి వైల్డ్ కార్డ్‌తో ఎంట్రీ ఇచ్చిన శిల్పా చక్రవర్తిని ఫోకస్ చేస్తూ ఎపిసోడ్ ప్రారంభ మైంది.బాబా భాస్కర్‌‌తో హౌస్ పరిస్థితులపై ఆరా తీస్తూ గేమ్ మొదలు పెట్టింది శిల్పా చక్రవర్తి.ఇక ఈవారం వీక్లీ టాస్క్‌లో భాగంగా కంటెస్టెంట్స్‌కు దొంగలు దోచిన నగరం అనే చెత్త టాస్క్ ఇచ్చారు బిగ్ బాస్..దొంగలు ముఠా,నగర వాసులు అని కంటెస్టెంట్స్‌ను రెండు గ్రూపులుగా విడగొట్టి తన్నుకుని చావమన్నారు బిగ్ బాస్.దొంగలకు రాణిగా శిల్పాను పెట్టారు.ఇక గేమ్ మొదలైన తరువాత బిగ్ బాస్ హౌస్ మొత్తం హింసాత్మకంగా మారిపోయింది.ఇదే అదనుగాన్ ఆడ,మగ అని చూసుకోకుండా ఒకరిమీద ఒకరు పడి కొట్టుకుంటూ,దూషించుకుని బలప్రదర్శనకు దిగారు.హౌస్ మొత్తం హంగామా సృష్టించారు.



రక్తం కారుతున్నా బట్టలూడుతున్న గేమ్‌ని కంటిన్యూ చేశారు.ఇలాంటి చెత్త హింసాత్మక గేమ్‌ని ఇచ్చిన బిగ్ బాస్ మధ్యలో ఎంటర్ అయ్యి శాంతి శాంతి,హౌస్‌లో హింసకు తావులేదని చెప్పడం గమనార్హం.అసలు కాన్సెప్ట్ మొత్తం హింసాత్మకం అయిన ప్పుడు కొట్టుకోకుండా తన్నుకోకుండా ఎలా ఉంటారన్న ఆలోచన లేకుండా ఈ గేమ్‌ని డిజైన్ చేశారు.స్మిమ్మింగ్ ఫూల్‌‌లో దిగి మరీ..ఆడమగ మొత్తం బల ప్రదర్శనకు దిగారు.ఒంటిపై బట్టలు ఉన్నాయో ఊడాయో కూడా పట్టించుకోకుండా ఒళ్లు మరిచి గేమ్ ఆడారు కంటెస్టెంట్స్.



రాహుల్,అలీలు ఐతే ఒకర్నొకరు గెంటుకుని కొట్టుకోగా,శ్రీముఖి,పునర్నవిలు కొట్టుకుని చస్తారేమో అన్నంత పనిచేశారు.ఇక ఈ గేమ్‌తో దెబ్బలు తగలని,తిట్టుకోని కంటెస్టెంట్ లేరంటే ఇది ఎంత హింసాత్మకంగా ఉందో అర్ధం చేసుకోవచ్చు.ఇక భార్యా భర్తలు గా ఉన్న వరుణ్,వితికాలు ఒకర్నొరు దూషించుకోవడమే కాకుండా,వితికాని కింద పడేసి,ఈడ్చి బాదినంత పనిచేశాడు వరుణ్.ఇక ఈ రచ్చ రేపు కూడా ఉండటంతో బిగ్ బాస్ ఎవరి తలలు పగల గొడతాడో,ఇంకెంత మంది కంటెస్టెంట్స్ రక్తం కళ్లు చూస్తాడో వేచి చూద్దాం.ఇక కాకరకాయ వేపుడులా ఘాటుగా,చిల్లి చికెన్‌లా స్పైసిలా అటు క్లాసు,ఇటూ మాస్‌ను బిగ్‌బాస్ షో అదరగొటుతుందని చూసిన వాళ్లు అనుకుంటున్నారు..

మరింత సమాచారం తెలుసుకోండి: