ఉయ్యాలవాడ నరసింహారెడ్డి...మనం మరచిపోయిన తొలి భారత స్వాతంత్ర సమరయోధుడు, తెలుగు పౌరుషం ఎలుగెత్తి చాటిన మహానుభావుడు, సైరా.. సై సైరా అని తెల్ల దొరల మీదకు ఉరికి భారతీయుల దమ్మేంటో చూపించిన మొనగాడు. గట్టిగా మూడేళ్ళు కూడా జీవించని ఈ కొదమ సింహం. స్వాంత్రంత్రం రావడానికి వందేళ్ళకు ముందే గర్జించి బ్రిటిష్ వారి గుండెల్లో దడ పుట్టించింది. అటువంటి విప్లవ వీరుడు, యోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవిత  కధను మెగాస్టార్ చిరంజీవి  సైరా నరసింహారెడ్డి పేరిట సినిమాగా తీర్చిదిద్దుతున్న సంగతి విధితమే.


ఈ మూవీ అక్టోబర్ 2న అంటే గాంధి జయంతి రోజున‌ విడుదల అవుతోంది. ఈ మూవీకి సంబంధించి ప్రమోషన్ వర్క్ అపుడే స్టార్ట్ అయిపోయింది. ముందుగా నరసింహారెడ్డి పుట్టిన గడ్డ ఉయ్యాలవాడ ఉన్న కర్నూలు  జిల్లా  నుంచే సైరా సినిమా ప్రమోషన్ స్టార్ట్ చేస్తారని తెలుస్తోంది. దాదాపుగా లక్ష మంది వరకూ మెగాభిమానులు హాజరయ్యే ఈ ఫంక్షన్ని అంగరంగ వైభవంగా చేసేందుకు మెగా టీం రెడీ అయిపోతోంది.



ఉయ్యాలవాడ పేరు చెబితే రాయలసీమ జిల్లాలు పులకించిపోతాయి. ఎటూ మెగాస్టార్ కి అక్కడ ఘనమైన అభిమానం జనం ఉన్నారు. వారి మధ్యనే విప్లవ యోధుడి సినిమా గురించి  చెబుతూ భారీ ఎత్తున సైరా  ప్రచారానికి తెర తీయనున్నారు. ఈ నెల మధ్యలో కర్నూల్లో జరిగే ఫంక్షన్ తో సైరా ప్రమోషన్ స్టార్ట్ అయినట్లే. ఇక ఆ తరువాత  ప్రీ రిలీజ్ ఫంక్షన్ హైదరాబాద్ లో నిర్వహించడం ద్వారా తెలంగాణా ప్రాంతంలో ప్రమోషన్ సైరా టీం చేపడుతుంది.




ఆంధ్రాకు సంబంధించి విశాఖపట్నం, విజయవాడలను చూస్తున్నారు. ఆ మీదట మెగాస్టార్ చెన్నై, బెంగుళూర్, , ముంబైల్లో కూడా సినిమా ప్రమోషన్లో పాలుపంచుకుంటారని తెలుస్తోంది. సుమారు  రెండువందల కోట్ల రూపాయలతో నిర్మిస్తున్న సైరా మూవీపై భారీ అంచనాలు  ఉన్నాయి. ఈ మూవీ వందల కోట్లు కొల్లగట్టి మరో బాహుబలిలా నిలబడుతుందని, చరిత్రను స్రుష్టించే సినిమాగా ఉంటుందని అంటున్నారు. 


మరింత సమాచారం తెలుసుకోండి: