బిగ్ బాస్ లో స్నేహాలు తొందరగా మారిపోతుంటాయి. మొదటి నుండి స్నేహంగా ఉన్న వాళ్ళు కూడా మారిపోతుంటే ఆశ్చర్యంగా అనిపించినా బిగ్ బాస్ లో అవన్నీ సాధారణమే అన్న విషయం గుర్తుంచుకోవాలి. శుక్రవారం ఎపిసోడ్ లో బాబా భాస్కర్ మహేష్ గురించి మాట్లాడుతూ, ఎంతో స్నేహంగా ఉండే మహేష్, కెప్టెన్సీ టాస్క్ లో తనకి ఓటు చేయలేదని, మహేష్ మారిపోయాడని అక్కడున్న వారితో డిస్కస్ చేస్తాడు. అలా మారిపోవడం తనకి నచ్చలేదని, నన్ను టార్గెట్ చేయడం బాలేదని అంటాడు.


అయితే ఇక్కడే బాబా భాస్కర్ తప్పు చేశాడని తెలుస్తుంది. బాబా భాస్కర్ కి నిజంగా మహేష్ మీద అంత స్నేహం ఉంటే అతనితోనే డైరెక్టుగా మాట్లాడి ఉంటే బాగుండేది. అంతే కానీ అతని గురించి హౌస్ మేట్స్ అందరితో చెడుగా మాట్లాడటం ఏమాత్రం బాలేదని అంటున్నారు. మహేష్ తో ఏదైనా ప్రామ్లెమ్ ఉంటే అతనితో మాట్లాడిన తర్వాత, హౌస్ మేట్స్ తో డిస్కస్ చేస్తే పద్దతిగా ఉండేది.


ఇవేమీ చేయకుండా హౌస్ మేట్స్ తో అతని గురించి మాట్లాడడంతో  బాబా భాస్కర్ తన వాల్యూని తగ్గించుకున్నాడని తెలుస్తుంది. మహేష్  బాబా భాస్కర్ కి చాలా విషయాల్లో హెల్ప్ చేశాడు. అయితే మహేష్, బాబా  భాస్కర్ ఒక్కరితోనే క్లోజ్ గా ఉంటున్నాడని కంప్లైంట్ రావడం వల్ల మహేష్ అందరితో స్నేహంగా ఉండే ప్రయత్నం చేస్తున్నాడు. నిజానికి అలా ఉన్నప్పటి నుండే అతను గేమ్ బాగా ఆడుతున్నాడు.


బాబా భాస్కర్ ఈ విషయాన్ని అర్థం చేసుకోకుండా తన తోటి వారితో మహేష్ గురించి డిస్కస్ చేయడం కరెక్ట్ కాదని వాదిస్తున్నారు. బాబా భాస్కర్ తనకున్న ఇష్యూని మహేష్ తో మాట్లాడి మనసులో ఉన్న దాన్ని పోగొట్టుకుంటే మంచిదని అంటున్నారు.



మరింత సమాచారం తెలుసుకోండి: