బిగ్ బాస్ లో శనివారం జరిగిన ఎపిసోడ్ లో చాలా రోజుల తర్వాత నాగార్జున గారు మళ్ళీ కనిపించారు. ఎప్పటిలానే శనివారం కూడా తనదైన శైలిలో అందరినీ అలరించాడు. అయితే శనివారం ఎపిసోడ్ లో మూడు తప్పులు జరిగినట్లుగా తెలుస్తుంది. అవేంటంటే, మొదటగా ఈ వారం మొత్తంలో కంటెస్టెంట్స్ అందరూ ఎక్కువగా ఇంగ్లీషులో మాట్లాడారు. ముఖ్యంగా శ్రీముఖి, పునర్నవి, వరుణ్ లు చాలా సార్లు ఇంగ్లీషులో మాట్లాడుతూ కనిపించారు.


ఆ విషయం గురించి బిగ్ బాస్ ఒక్కసారి కూడా హెచ్చరించలేదు. కనీసం నాగార్జున గారైనా వారిస్తారని అనుకున్నారు. కానీ నాగార్జున అలాంటి ప్రయత్నమే చేయలేదు. ఈ విషయం గురించి ఎందుకు మాట్లాడలేదో అర్థం కాలేదు. ఇక రెండోది,  శనివారం ఎపిసోడ్ లోనే పునర్నవి నాగార్జున గారి ముందే ఇంగ్లీషులో మాట్లాడుతుంది. అయినా కూడా నాగార్జున ఏమీ అనకపోవడం ఆశ్చర్యకరం. పునర్నవి చాలా సార్లు ఇంగ్లీషులోనే మాట్లాడుతుంది.


ఇంగ్లీషులో మాట్లాడకూడదనేది బిగ్ బాస్ ఇంట్లో నియమం. ఇక మూడోదానికి వస్తే, నాగార్జున ఆడించిన గేమ్ లో  పోలీస్ ఆఫీసరు గా ఉన్న బాబా భాస్కర్ తన అభిప్రాయాన్ని సరిగ్గా  చెప్పలేకపోయాడు. ఎవరు దోషి, ఎవరు నిర్దోషి అనే దానిలో ఎక్కువ మంది ఎవరికైతే ఓటేశారో బాబా భాస్కర్ కూడా అటు వైపే మొగ్గాడు. అలా కాకుండా వారి పట్ల తను ఫీలయిన అభిప్రాయాన్ని తెలిపి ఉంటే బాబా భాస్కర్ పై మరింత గౌరవం పెరిగి ఉండేదని భావిస్తున్నారు.


ఏదో నాగార్జున అడిగాడు కాబట్టి చెప్పక తప్పదు కాబట్టి చెప్పినట్టుగా వ్యవహరించాడు. ఈ మూడు తప్పులు జరగకపోయి ఉంటే షో మరింత బాగా జరిగి ఉండేదని అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. మరి ఈ రోజు ఇలాంటి తప్పులు రిపీట్ కాకుండా నాగార్జున గారు చూసుకుంటారని ఆశిస్తున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: