''నేను 2012 తరువాత మళ్ళీ ఇప్పుడే రీమేక్ చేస్తున్నా. నా దృష్టిలో అన్ని సినిమాలు రీమేక్‌లే. ఒక సినిమాకి ఒక పుస్తకం, ఒక నవల, ఒక వ్యక్తి, ఇన్స్పిరేషన్ అయినప్పుడు ఒక సినిమాకు ఇంకో సినిమా ఎందుకు ఇన్స్పిరేషన్ కాకూడదు అనేది నా భావన. ఒక సినిమా ప్రేమికుడిగా నాకు నచ్చిన ఏ సినిమా నైనా రీమేక్ చేస్తాను'' అని దర్శకుడు హరీష్ శంకర్ తేల్చిచెప్పారు. 'షాక్', 'మిరపకాయ్', 'గబ్బర్‌సింగ్', 'డీజే' లాంటి సూపర్ హిట్ చిత్రాలతో కమర్షియల్ డైరెక్టర్‌గా ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న హరీష్ శంకర్, ప్రస్తుతం వరుణ్ తేజ్ హీరోగా 'వాల్మీకి' చిత్రానికి దర్శకత్వం వహించారు. 14 రీల్స్ ప్లస్ బ్యానర్‌పై రామ్ ఆచంట, గోపీ ఆచంట నిర్మించిన ఈ చిత్రంలో తమిళ హీరో అధర్వ కీలక పాత్రలో నటించారు. తమిళ 'జిగర్తాండ'కు రీమేక్. మిక్కీ జె మేయర్ సంగీతాన్ని అందించిన ఈ చిత్రంలో పూజ హెగ్డే ప్రత్యేక పాత్రలో నటించింది. ఈనెల 20న విడుదల కాబోతున్న సందర్భంగా హరీష్ శంకర్ చెప్పిన విశేషాలు.
వరుణ్‌ను ఎంచుకోవడానికి కారణం?
నేను వరుణ్ని 'దాగుడు మూతలు' స్క్రిప్ట్ పని మీద కలిశాను. ఆ టైమ్‌లోనే వరుణ్ నాతో ఈ స్క్రిప్ట్ నాతోనే ఎందుకు చేయాలి అనుకుంటున్నారని అడిగాడు. 'తొలిప్రేమ', 'ఫిదా' లాంటి సినిమాలు చేస్తున్నావు కదా నాకు కొత్తగా ఉంటుంది అన్నాను. దానికి వరుణ్ నేను మీతో మీ టైప్ సినిమాలు చేస్తాను అప్పుడు నాకు కొత్తగా ఉంటుందని అన్నారు. ఆ టైమ్‌లోనే కార్తిక్ సుబ్బరాజన్ 'పేట' సినిమా ఫస్ట్‌లుక్ విడుదలయింది. ఆయన సినిమాలు బాగుంటాయి కదా అని 'జిగర్తాండ' సినిమా చూశాను. బాగా నచ్చడంతో ఈ సినిమాను రీమేక్ చేద్దాం అని అనుకోవడంతో ఈ ప్రాజెక్ట్ స్టార్ట్ అయింది.
మాతకలో ఎలాంటి మార్పులు చేశారు?
'దబాంగ్' సినిమాను 'గబ్బర్‌సింగ్'గా చేసినన్ని మార్పులు ఈ సినిమాలో చేయలేదు. ఎందుకంటే 'జిగర్తాండ'నే బ్యూటిఫుల్ కంటెంట్. ఆ స్క్రీన్ ప్లే, కంటెంట్ అంటేనే నాకు చాలా ఇష్టం. నేటివిటీకి సంబంధించి చిన్న చిన్న మార్పులే చేశాను. అక్కడ బాబీ సింహ చేసిన క్యారెక్టర్‌ను వరుణ్ క్యారక్టరైజేషన్కి సరిపోయేటట్లు కొన్ని మార్పులు చేయడం జరిగింది.
టైటిల్ జస్టిఫికేషన్ ఏంటి?
ఓ మనిషి అత్యున్నతమైన మార్పుకి 'వాల్మీకి మహర్షి' గొప్ప నిదర్శనం. ఆయన అందరికీ ఇన్స్పిరేషన్. ఈ సినిమాలో వరుణ్ క్యారెక్టర్ ట్రాన్స్ఫర్మేషన్ అనేది హైలెట్‌గా ఉంటుంది. ఈ సినిమా కథే అది అవడంతో ఈ టైటిల్‌నే ఫిక్స్ చేశాం.
పూజ హెగ్డే క్యారెక్టర్ గురించి?
సెకండ్ హాఫ్‌లో వచ్చే చాలా ఇంపార్టెంట్ క్యారెక్టర్. ఆ ఒక్క క్యారెక్టర్ ఆడియన్స్‌కి సస్పెన్స్ ఇచ్చేలా ప్లాన్ చేశాం. అందుకే దాని ఇప్పుడే రివీల్ చేయడం లేదు. సినిమాలో చూసి ఎంజాయ్ చేయాల్సిందే.
చాలా పాటలు ఉండగా 'ఎల్లువొచ్చి గోదారమ్మ' పాటనే ఎందుకు రీమిక్స్ చేశారు?
ఈ సినిమాలో పూజ హెగ్డే క్యారెక్టరైజెషన్ కానీ, ఆ సాంగ్ కానీ కథ డిమాండ్ మేరకే పెట్టడం జరిగింది తప్ప ఎదో కమర్షియల్‌గా ఒక రీమిక్స్ పాట పెట్టాలని కాదు. అలా అనుకుంటే చిరంజీవి, పవన్ కళ్యాణ్ సాంగ్సే బోలెడు ఉన్నాయి. ఈ సినిమాలో నాలుగు పాటలు ఉన్నాయి. యాక్షన్ ఎపిసోడ్స్ తక్కువ ఉంటాయి. అయినా నా అన్ని సినిమాల కంటే ఎక్కువ లెంగ్త్‌తో వస్తోంది అంటే కంటెంట్ ఎక్కువగా ఉండబోతుంది.
వరుణ్ క్యారెక్టర్ డిజైన్ చేయడానికి ఎలాంటి కేర్ తీసుకున్నారు?
వరుణ్ హీరో అవ్వక ముందు నాగబాబుగారు కొన్ని ఫొటోస్ పంపారు. ఆ ఫొటోల్లో వరుణ్ ఇంచుమించు ఇలానే కనిపిస్తాడు. ఆ ఫొటోస్ నా మనసులో ఉండడంతో వరుణ్‌కి ఆ లుక్ బాగుటుందని దాదాపు ఆరు నెలలు గడ్డం పెంచి ఈ లుక్‌లోకి తీసుకురావడం జరిగింది.
మరో క్యారెక్టర్ కోసం అధర్వ మురళినే సెలెక్ట్ చేసుకోవడానికి రీజన్ ఏంటి?
తెలుగులో కూడా చాలా మంది టాలెంటెడ్ యంగ్ స్టర్స్ ఉన్నారు. మేము కూడా కొంతమందిని ఆడిషన్ చేశాం. కానిసినిమాలో ఒక ఆస్పైరింగ్ డైరెక్టర్లా కనిపించాలి. అలాగే మంచి యాక్టర్ అయ్యి ఉండాలి అనుకున్నపుడు అధర్వని చూసి సెలక్ట్ చేశాం.
మిక్కీ జె మేయర్ క్లాసిక్, మెలోడి పాటలకు ప్రసిద్ధి కదా! మాస్ సినిమాకు ఎందుకు సెలెక్ట్ చేసుకున్నారు?
మిక్కీతో నేను 'సుబ్రమణ్యంఫర్ సేల్ 'సినిమా చేశాను. కాని ప్రాపర్‌గా అతనితో వర్క్ చేయలేకపోయా. ఆయనతో ఎక్కువ టైమ్ స్పెండ్ చేస్తే ఇంకా బాగా చేయగలుగుతాడు అనిపించింది. అందుకే ఈ సినిమాకు ఆయన్ని సెలెక్ట్ చేశాను.
పవన్ కళ్యాణ్‌తో సినిమా చేయబోతున్నారు అని గట్టిగా వినిపిస్తుంది?
ఫ్యాన్స్‌తో పాటు మీరు కూడా సినిమా త్వరగా జరగాలని కోరుకోండి. తప్పకుండా జరుగుతుంది. నేను కూడా పవన్ కళ్యాణ్‌గారితో సినిమా ఎప్పుడెప్పుడు చేయాలా అని వెయిటింగ్. ఒక వారం క్రితం పవన్‌కళ్యాణ్‌గారిని కలిసి ట్రైలర్ చూపించాను. చాలా బాగుంది హరీష్ అన్నారు.
వాల్మీకిలో మిగతా క్యారెక్టర్స్ గురించి?
ఈ సినిమాలో బ్రహ్మానందం చిన్న క్యారెక్టర్ చేశారు. అలాగే సుకుమార్ కూడా గెస్ట్ అప్పీరియన్స్ ఇస్తారు. సత్య మరో సారి ఫ్రెండ్ క్యారెక్టర్లో బాగా చేశాడు. మరో ఫ్రెండ్ క్యారెక్టర్ ఛాయ్ బిస్కెట్లో చేసే అరుణ్ చేశారు. వరుణ్ డెడికేషన్, కమిట్ మెంట్ షూటింగ్ టైమ్‌లో చూశా. 85 రోజులు షూట్ చేస్తే 85 రోజులు నవ్వుతూ చేసిన నా మొదటి హీరో వరుణ్.
మెగా ఫ్యాన్స్‌కి ఏం చెప్తారు?
వరుణ్ ఫ్యాన్స్‌కి, మెగా ఫ్యాన్స్‌కి నేను చెప్పేది ఏంటంటే.. ఈనెల 20న 'వాల్మీకి' సినిమాలో వరుణ్ యొక్క నట విజంభన చూస్తారు. ముఖ్యంగా ఇంటర్వెల్. క్లైమాక్స్‌లో వరుణ్ నేను ఊహించుకున్నదానికంటే ఎక్స్ట్రార్డినరీగా చేశారు. సినిమా అయిపోయాక 5 సంవత్సరాల తర్వాత నేను వరుణ్ ఎప్పుడు 'వాల్మీకి' గురించి మాట్లాడుకున్న మాకు గర్వంగా అనిపించే విధంగా సినిమా ఉంటుంది.
మీరు ఫ్యూచర్లో సినిమాలు ప్రొడ్యూస్ చేసే అవకాశం ఉందా?
తప్పకుండా ఉంది. తెలుగులో మంచి కంటెంట్ ఉన్న సినిమాలను బాగా ఆదరిస్తున్నారు కాబట్టి మంచి కంటెంట్ సినిమాలు వచ్చే స్కోప్ ఎక్కువ ఉంది. నేను రైటింగ్, డైరెక్షన్లో బిజీగా ఉంటాను కాబట్టి ఒక్కడినే ప్రొడ్యూస్ చేయలేను. అందుకే 'జవాన్' ప్రొడ్యూసర్ కష్ణగారితో, మహేష్ఎస్కోనేరు ఇంకా ఇద్దరుముగ్గురు స్నేహితులు ఉన్నారు వారితో కలిసి ప్రొడ్యూస్ చేస్తాను.
తదుపరి చిత్రాలు
మూడు కథలు పైప్‌లైన్‌లో ఉన్నాయి. 'వాల్మీకి' విడుదలయ్యాక వాటిగురించి చెప్తాను.