తెలుగు గడ్డకు చెందిన వీర విప్లవకారుడు “ఉయ్యాలవాడ నరసింహా రెడ్డి”  జీవితం ఆధారంగా  మెగాస్టార్ చిరంజీవి నటించిన 'సైరా' చిత్రం ట్రైలర్  మరో రెండు గంటల్లో  విడుదలకానుంది. అయితే  రాబోయే 13 రోజుల పాటు  మెగా ఫ్యాన్స్ కు వరుస ట్రీట్స్  ఉన్నాయి. మొదట ఈ రోజు జరగబోయే  'సైరా' ట్రైలర్ విడుదల ట్రీట్ కోసం ఇప్పటికే  మెగా అభిమానులు ఆశగా వెయిట్ చేస్తున్నారు.   ఆర్టీసీ క్రాస్ రోడ్స్ జరగబోయే ఈ వేడుకకు రామ్ చరణ్ ముఖ్య అతిధిగా హాజరుకానున్నారు.  ఇక మరో ట్రీట్  20వ తేదీన వరుణ్ తేజ్ 'వాల్మీకి' విడుదల కానుంది. అలాగే 22న  'సైరా' ప్రీ రిలీజ్ వేడుక ఉండనే ఉంది.   ఈ కార్యక్రమానికి పవన్ కళ్యాణ్ చీఫ్ గెస్ట్.  మిగతా మెగా హీరోలంతా హాజరుకానున్నారు.  కాబట్టి అభిమానులకు కన్నుల పండుగనే అనాలి.  ఇక అన్నిటికి మించి అక్టోబర్ 2న 'సైరా' సినిమా విడుదల.  ఆ రోజున మెగా ఫ్యాన్స్  చేసే సంబరాలు గురించి హడావుడి గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఇలా రానున్న రెండు వారలు మెగా ఫ్యాన్స్ కి వరుసగా ట్రీట్స్ ఉన్నాయి.  ఇక సైరా ట్రైలర్  రెండు తెలుగు రాష్ట్రాల్లోని అనేక థియేటర్లలో ట్రైలర్ ప్రదర్శితం కానుంది.  హైదరాబాద్ సిటీలోని ఆర్టీసీ క్రాస్ రోడ్స్ నందు గల సుదర్శన్ 35 ఎం.ఎం, సంధ్య 70 ఎం.ఎం థియేటర్లలో,  తిరుపతి సిటీలోని సంధ్య థియేటర్లో,    నెల్లూర్ సిటీలోని ఎస్ 2 సినిమాస్, విజయవాడ అప్సర,   వైజాగ్ జగదాంబ, శరత్ థియేటర్లలో, గుంటూరులోని క్రిష్ణ మహల్, భీమవరంలో విజయలక్ష్మి, మదనపల్లిలోని రవి థియేటర్, ఎలూరులోని సాయి బాలాజి, అనంతపూర్ వి మెగా, రాజమండ్రిలోని అనుశ్రీ, సూర్య ప్యాలెస్, గీతా అప్సర థియేటర్ ఇలా అన్ని నగరాల్లోని ప్రధాన థియేటర్లలో ట్రైలర్ రిలీజ్ కానుంది.  దీంతో ఫ్యాన్స్ రాష్ట్రవ్యాప్తంగా అనేక థియేటర్ల వద్ద కేక్ కటింగ్ వంటి కార్యక్రమాల్ని ప్లాన్ చేసి అభిమానులకు స్వాగతం పలుకుతున్నారు.  ట్రైలర్ విడుదలకే సంబరాలు ఇలా ఉంటే ఇక అక్టోబర్ 2న సినిమా విడుదలను పెద్ద పండుగలా సెలబ్రేట్ చేస్తారేమో.  


కాగా ఈ చిత్రం పై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి.  అందుకే  ప్రముఖ టీవీ ఛానల్,  జీ టీవీ ఈ చిత్రం యొక్క  శాటిలైట్ అండ్ డిజిటల్ రైట్స్ ను  125 కోట్ల భారీ మొత్తానికి కొనుగోలు చేసింది.  ఇక  టీజర్ ను చూసే  ఊగిపోయిన అభిమానులు, ఇప్పుడు  ట్రైలర్ చూసి  ఎలా ఫీల్ అవుతారో. అయితే  ట్రైలర్ లో  అనుష్కకు సంబంధించిన షాట్స్ కూడా ఉన్నట్టు వార్తలు వినిపిస్తన్నాయి. ఈ చిత్రంలో అనుష్క ఝాన్సీ లక్ష్మీభాయ్ పాత్రలో నటిస్తున్న సంగతి తెలిసిందే.  మరి ట్రైలర్ లో అనుష్క ఎలా ఉండబోతుందో చూడాలి.  ఇక 5 భాషల్లో భారీ ఎత్తున విడుదలవుతున్న ఈ చిత్రం యొక్క హక్కులకు అన్ని భాషల్లోనూ డిమాండ్ అధికంగానే ఉంది.  దీంతో ప్రీ రిలీజ్ బిజినెస్ విషయంలోనే పలు కొత్త రికార్డులు క్రియేట్ చేస్తున్నారు మెగాస్టార్.  పైగా  నిర్మాత రామ్ చరణ్ ఈ చిత్రాన్ని ఎక్కడా రాజీ పడకుండా అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించారు.  ఈ సినిమాలో  సుదీప్, విజయ్ సేతుపతి, జగపతిబాబు, అనుష్క  వంటి స్టార్ లు కూడా  నటిస్తున్నారు.  అందుకే సైరా కోసం తెలుగు ప్రేక్షకులే కాకుండా.. హిందీ, కన్నడ మరియు తమిళ ప్రేక్షకులు కూడా  సినిమా పై ఎంతో ఆసక్తిగా ఉన్నారు.  ఈ చిత్రంలో నయనతార కథానాయికగా నటిస్తుంది.  


మరింత సమాచారం తెలుసుకోండి: