విజయ్ దేవరకొండ హీరోగా వస్తున్న వరల్డ్ ఫేమస్ లవర్ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ తో సినిమాపై క్రేజ్ వచ్చేలా చేసుకుంది. తన ప్రతి సినిమాలానే విజయ్ ఈ సినిమాకు ఫస్ట్ లుక్ తోనే సూపర్ బజ్ క్రియేట్ చేశాడు. క్రాంతి మాధవ్ డైరక్షన్ లో తెరకెక్కుతున్న ఈ సినిమాను క్రియేటివ్ కమర్షియల్ బ్యానర్ లో కె.ఎస్ రామారావు నిర్మిస్తున్నారు. 


సినిమా ఒకరు ఇద్దరు కాదు ఏకంగా నలుగురు హీరోయిన్స్ ఉన్నారు. ఒక హీరోయిన్ ఉంటేనే లిప్ లాక్స్ తో రచ్చ చేసే విజయ్ దేవరకొండ నలుగురు హీరోయిన్స్ తో ఎలాంటి హంగామా చేస్తాడో అని ఫ్యాన్స్ ఈగర్ గా ఎదురుచూస్తున్నారు. ఇక ఈ సినిమా ఫస్ట్ లుక్ చూసిన ప్రేక్షకులు పక్కా హిట్ అనేస్తున్నారు.


సినిమా రిలీజ్ ముందు విజయ్ సినిమాల హంగామా బాగున్నా డియర్ కామ్రేడ్ ఫెయిల్యూర్ వల్ల విజయ్ వరల్డ్ ఫేమస్ లవర్ కు తగిన జాగ్రత్తలు తీసుకుంటున్నాడట. అందుకే ఈ సినిమా కోసం డైరక్టర్ సందీప్ వంగ హెల్ప్ తీసుకుంటున్నారట. అదేంటి సినిమాకు క్రాంతి మాధవ్ కదా డైరక్టర్ అనుకోవచ్చు. సినిమాకు దర్శకుడు ఆయనే కాని సినిమా రషెస్ చూసి సందీప్ వంగ సపోర్ట్ అడిగారట.  


కచ్చితంగా సందీప్ హ్యాండ్ పడితే వరల్డ్ ఫేమస్ లవర్ కు చాలా హైప్ వచ్చేస్తుంది. సినిమాలో విజయ్ మరోసారి లవ ఫెయిల్యూర్ గాయ్ గా కనిపిస్తాడని అంటున్నారు. ఫస్ట్ లుక్ లోని ఇంటెన్స్ మరోసారి విజయ్ టాలెంట్ ఏంటో చూపించింది. గోపి సుందర్ మ్యూజిక్ అందిస్తున్న ఈ సినిమా డిసెంబర్ లో రిలీజ్ ప్లాన్ చేస్తున్నారు. మరి వరల్డ్ ఫేమస్ లవర్ సినిమా ఎలా ఉంటుంది. సినిమా విజయ్ కు హిట్టు ఇస్తుందా లేదా అన్నది తెలియాలంటే సినిమా వచ్చేదాకా వెయిట్ చేయాల్సిందే.  



మరింత సమాచారం తెలుసుకోండి: