బాలీవుడ్ లో సంజయ్ దత్ నటించిన సినిమాలకు ఒకప్పుడు ఎంత క్రేజ్ ఉండేదో అందరికీ తెలిసిందే.  అయితే ముంబాయి బాంబ్ బ్లాస్ట్ కేసుల్లో అక్రమ ఆయుధం కలిగి ఉన్నాడని టాడా చట్టం కింద సంజయ్ దత్  అరెస్ట్ కావడం..పదమూవు సంవత్సరాలు జైలు జీవితం అనుభవించాడు. ప్రస్తుతం పలు సినిమాల్లో నటిస్తున్న సంజయ్ దత్ నటించిన ‘ప్రస్థానం’ మూవీ శుక్రవారం రిలీజ్ అయ్యింది.  అయితే ఈ మూవీకి వేరే ఏ సినిమా కూడా పెద్దగా కాంపిటిషన్ లేకున్నా ఫ్లాప్ టాక్ రావడంతో ఆ ప్రభావం కలెక్షన్ల పై పడింది. 

ఈ మధ్యకాలంలో టాలీవుడ్ లో సక్సెస్ అందుకున్న చాలా సినిమాలు బాలీవుడ్ లో రీమేక్ చేయడానికి ఆసక్తి చూపుతున్నారు. బాలీవుడ్ ప్రేక్షకులు కూడా ఆ మూవీలను ఆదరిస్తుండడంతో వీటికి డిమాండ్ బాగా పెరిగింది. ఈ క్రమంలో తెలుగులో 2010లో సాయికుమార్, శర్వానంద్ ప్రధాన పాత్రల్లోతెరకెక్కిన 'ప్రస్థానం' సినిమాను బాలీవుడ్ లో రీమేక్ చేశారు. అప్పట్లో ఈ మూవీ హిట్ టాక్ రావడంతో మంచి సక్సెస్ సాధించింది. ఈ మూవీ అప్పట్లో కలెక్షన్లు కూడా బాగానే రాబట్టింది. కానీ హిందీలో మాత్రం సినిమా ఆశించిన ఫలితాన్ని రాబట్టలేకపోయింది. 

సంజయ్ దత్ లాంటి పెద్ద హీరో నటంచినా కూడా ఆ సినిమాకి వచ్చిన వసూళ్లు చూస్తుంటే షాక్ అవ్వక మానరు. శుక్రవారం అక్కడ రిలీజ్ అయిన ప్రస్థానం మూడు రోజులకు గాను కేవలం మూడు కోట్లు మాత్రమేరాబట్టింది.  సంజయ్ దత్ లాంటి టాప్ హీరో మూవీకి ఇంత దారుణమైన కలెక్షన్లు రావడం అక్కడ సినీ వర్గాల్లో చర్చనీయాంశంగా మిగిలిపోయింది.  ఇక పెద్ద హీరో సినిమా కనీసం రెండు డిజిటల్ మార్క్ కూడా దాటకపోవడమంటే సినిమా పరిస్థితి ఏంటో అర్ధమవుతోంది. ఈ సినిమాతో బాలీవుడ్ లో తన మార్క్ క్రియేట్ చేస్తాడని భావించిన దేవకట్టా సత్తా చాటలేకపోయాడు. 


మరింత సమాచారం తెలుసుకోండి: