ప్రముఖ హాస్య నటుడు వేణు మాధవ్ తీవ్ర అనారోగ్యానికి గురయ్యారు. ప్రస్తుతం ఆయన పరిస్థితి విషమంగా ఉంది. సూర్యాపేట జిల్లా కోదాడ నుండి  వచ్చిన వేణుమాధవ్.... ఎన్నో విభిన్నమైన పాత్రలు వేసుకుంటూ తనదైన స్టైల్ లో  ప్రేక్షకులకు  హాస్యాన్ని పంచాడు. ఆర్టిస్టుగా హాస్య నటుడిగానే కాకుండా కథానాయకుడిగా కొన్ని  చిత్రాల్లో నటించి ప్రేక్షకులను మెప్పించాడు వేణుమాధవ్. 1996లో ఎస్వీ కృష్ణారెడ్డి దర్శకత్వం వహించిన సాంప్రదాయం చిత్రంతో సినిమారంగంలోకి ప్రవేశించిన హాస్య నటుడు వేణుమాధవ్... ఎన్నో వైవిధ్యమైన పాత్రలు చేసుకుంటూ తనదైన ముద్ర వేసుకున్నాడు. 

 

 

తొలిప్రేమ, దిల్,  లక్ష్మి,  ఇలా పలు చిత్రాల్లో  భిన్నమైన కామెడీతో మంచి పేరు తెచ్చుకున్నాడు వేణుమాధవ్. అంతేకాకుండా 2006లో ఉత్తమ హాస్యనటుడుగా  వేణుమాధవ్ పురస్కారాన్ని కూడా అందుకున్నాడు. అయితే గత కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న వేణుమాధవ్... చికిత్స నిమిత్తం సికింద్రాబాద్ యశోద ఆసుపత్రిలో ఈ నెల 6న చేరారు. అయితే యశోద హాస్పిటల్ లో చికిత్స పొందుతున్న వేణుమాధవ్ పరిస్థితి విషమించడంతో డాక్టర్లు ఆయనకు కృత్రిమ శ్వాస అందిస్తున్నారు. కాగా  ఆయన రెండు కిడ్నీలు పాడవడం తోనే ఆయన పరిస్థితి విషమంగా మారింది. ఈ విషయం తెలుసుకున్న మా  అసోసియేషన్ ఉపాధ్యక్షురాలు జీవిత రాజశేఖర్ తోపాటు పలువురు కామెడీయన్స్ హాస్పిటల్ కి చేరుకున్న వేణుమాధవ్  ఆరోగ్య పరిస్థితి గురించి అడిగి తెలుసుకున్నారు.

 

 

 కాగా హాస్యనటుడిగా డిఫెరెంట్ కామెడీ తో  తనదైన ముద్ర వేసుకున్నాడు వేణుమాధవ్ . ఎవరికీ సాధ్యం కాని డిఫరెంట్ కామెడీ యాక్టింగ్ తో యాక్టింగ్ తో ప్రేక్షకులకు హాస్యాన్ని పంచాడు వేణుమాధవ్. అయితే గత కొన్ని సంవత్సరాలుగా వేణుమాధవ్ ఎక్కడ తెరపై కనిపించలేదు. ఆయనకు సినిమాల్లో అవకాశాలు దక్కకపోవడంతో సాఫీగా వ్యవసాయం చేసుకుంటూ ఉన్నానని  వేణుమాధవ్ కొన్ని సార్లు చెప్పిన విషయం కూడా తెలిసిందే. కాగా  వేణుమాధవ్ పరిస్థితి విషమించడంతో ఆయన అభిమానులు ఆందోళన చెందుతున్నారు. భిన్నమైన మేనరిజంతో వివిధ సినిమాలో వేణుమాధవ్ తనదైన కామెడీని పండించాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: