పదేళ్లుగా ఎదురుచూస్తున్న పవర్ స్టార్ ఫ్యాన్స్ కు గబ్బర్ సింగ్ రూపంలో హిట్టు ఇచ్చిన దర్శకుడు హరీష్ శంకర్. షాక్ తో డైరక్టర్ గా మారి ఆడియెన్స్ కు షాక్ ఇచ్చినా ఆ తర్వాత మిరపకాయ్ సినిమాతో హిట్టు కొట్టాడు. ఇక గబ్బర్ సింగ్ తో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ స్టామినా ఏంటో ప్రూవ్ చేసే సంచలనం సృష్టించాడు.


అప్పటి నుండి మెగా హీరోల సినిమాలంటే హరీష్ శంకర్ ఎక్కువ కేర్ తీసుకుంటున్నాడు. పవన్ తర్వాత మెగా మేనళ్లుడు సాయి ధరం తేజ్ తో సుబ్రహ్మణ్యం ఫర్ సేల్ సినిమా తీసి అది కూడా హిట్టు కొట్టాడు హరీష్ శంకర్. ఇక స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ తో దువ్వాడ జగన్నాథం రిజల్ట్ కూడా మనకు తెలిసిందే.


ఇక రీసెంట్ గా మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ తో చేసిన గద్దలకొండ గణేష్ కూడా హరీష్ ఖాతాలో ఒక హిట్టు పడ్డది. మెగా హీరో సినిమా అంటే చాలు హరీష్ కు ఎక్కడ లేని ఊపు వస్తుంది. మధ్యలో ఎన్.టి.ఆర్ తో చేసిన రామయ్య వస్తావయ్య సినిమా ఫ్లాప్ అవడంతో హరీష్ శంకర్ ఓన్లీ ఫర్ మెగా హీరోస్ అనే ట్యాగ్ లైన్ పడ్డది. వరుణ్ తేజ్ సినిమా హిట్ అవడంతో ఆ సెంటిమెంట్ మరింత బలపడ్డది. 


అందుకే పవర్ స్టార్ తన తర్వాత సినిమా హరీష్ శంకర్ డైరక్షన్ లో చేయాలని అంటున్నాడట. ఆల్రెడీ మైత్రి మూవీ మేకర్స్ పవన్ కు అడ్వాన్స్ ఇవ్వగా హరీష్ శంకర్ తో డిస్కషన్స్ చేస్తున్నారట. ఇప్పటికే గబ్బర్ సింగ్ తర్వాత పవన్ సినిమా కోసం వెయిట్ చేస్తున్న హరీష్ శంకర్ ఒకవేళ పవన్ తో మరో అవకాశం వస్తే తప్పకుండా చేస్తా అంటున్నాడు. అయితే పవన్ సినిమా చేయడం ఓకే అయితే హరీష్ డైరక్షన్ లోనే సినిమా ఉంటుందన్నమాట.



మరింత సమాచారం తెలుసుకోండి: