గాంధీ జయంతి సందర్భంగా అక్టోబర్ 2వ తేదీన భారీ స్థాయిలో విడుదల కానున్న అతి భారీ బడ్జెట్ చిత్రం అయిన సైరా పైన మెగా అభిమానులు కొండంత ఆశలు పెట్టుకున్నారు. చిరు ఖైదీ 150 సినిమా తర్వాత వస్తున్న సినిమా ఇదే కావడం… వినయ విధేయ రామ ఫ్లాప్ అవడంతో పాటు అల్లు అర్జున్ దాదాపు ఒక సంవత్సరం పైన ఖాళీగా ఉండడంతో మెగా ఫ్యామిలీ నుంచి పెద్ద సినిమాలు కరువయ్యాయి అనే చెప్పాలి. ఇప్పుడు వాళ్ళందరి ఆరాటాన్ని తీర్చేలా సైరా చిత్రం ఇప్పటికే మంచి టీచర్ మరియు అదిరిపోయే ట్రైలర్ తో సినీ పండితులందరినీ మెప్పించింది.

చాలా ప్రత్యేకమైన తారాగణంతో తెరకెక్కిన ఈ చిత్రంలో నయనతార సిద్ధమ్మ గా నటించగా, తమన్నా లక్ష్మీ గా తన సత్తా చూపనుంది. ఇకపోతే దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు గ్రహీత అమితాబ్ బచ్చన్ గోసాయి వెంకన్న గా నటిస్తుండగా జగపతి బాబు వీరారెడ్డి పాత్రలో కనువిందు చేయనున్నాడు. తమిళం నుండి వర్సటైల్ యాక్టర్ విజయ్ సేతుపతి రాజపాండి పాత్రను పోషించగా.... కన్నడ స్టార్ సుదీప్ అవుకు రాజు గా కనిపించనున్నాడు. అయితే ఈ పాత్రలన్నింటిలో ఒకరు సినిమా ఆఖరిలో వెన్ను చూపిస్తారని కొన్ని వార్తలు వచ్చాయి.

ట్రైలర్ లో మనం  పైన చెప్పబడిన పాత్రలన్నీ చిరంజీవికి అనుకూలంగా... ఆయనతో కలిసి బ్రిటిష్ వారిని ఎదుర్కోవడంలో సహాయపడతారు. అయితే వీరిలో వీరారెడ్డిగా నటిస్తున్న జగపతిబాబు చిరంజీవితోనే ఉంటూ అంగరక్షకుడిగా అతని కాపాడాల్సింది పోయి చివర్లో వెన్నుపోటు పొడుస్తాడు అని వార్తలు బయటకు వచ్చాయి. ఏదైనా పేరుమోసిన స్వాతంత్ర యోధుడు కథ అయితే మనం పేరు చెప్పగానే అతని పాత్రను అంచనావేయొచ్చు కానీ ఎవరికీ తెలియని కథని చెప్పాలనుకుంటున్న సైరా టీం... ఏ పాత్ర లో ఏం రహస్యం దాగి ఉందో ఎవరికైనా చెప్పడం కష్టం. మొత్తానికి జగపతిబాబు వీరారెడ్డిగా సైరాకి మాత్రం ఏదో అపకారం తలపెట్టనున్నాడని తెలుస్తోంది .


మరింత సమాచారం తెలుసుకోండి: