సౌత్ లో క్రేజీ హీరోయిన్ అయిన మిల్కీ బ్యూటీ తమన్నా ఈమధ్య కెరియర్ లో వెనుకపడినట్టు అనిపించినా మళ్లీ వరుస అవకాశాలను అందుకుంటుంది. స్టార్ హీరోలతో పాటుగా డ్యాన్స్ చేయగలిగే ప్రస్తుత స్టార్ హీరోయిన్ ఎవరైనా ఉన్నారంటే అది కేవలం తమన్నా మాత్రమే. ఎంతమంది హీరోయిన్స్ వచ్చినా మిల్కీ చార్మింగ్ ముందు చిన్నబోవాల్సిందే.


కేవలం హీరోయిన్ గానే కాదు బాహుబలిలో అవంతికగా నటించిన తమన్నా మెగాస్టార్ చిరంజీవి హీరోగా వస్తున్న సైరా నరసింహా రెడ్డి సినిమాలో కూడా ఆమె మంచి పాత్ర చేసింది. అయితే ఇక మీదట తను కేవలం పాత్ర ప్రాధాన్యత ఉన్న పాత్రలే చేస్తానని చెబుతుంది తమన్నా. ఇన్నాళ్లు గ్లామర్ షో చేసినా ఇక మీదట మాత్రం పాత్ర ప్రాధాన్యత ఉంట్నే సినిమా ఒప్పుకుంటా అంటుంది.


అది స్టార్ హీరో సినిమా అయినా సరే తన పాత్ర నచ్చకుంటే ఓకే చెప్పనని అంటుంది తమన్న. ఓ పక్క మిగతా హీరోయిన్స్ అంతా ప్రయోగాలు చేస్తుంటే తను మాత్రం ఇంకా కమర్షియల్ సినిమాల్లో పాటలకు మాత్రమే వాడుకునే హీరోయిన్ గా ఎందుకు చేయడం అనిపించింది తమన్నకు. అందుకే ఇక మీదట అలాంటి సినిమాలు చేసేది లేదని గట్టిగానే చెబుతుంది.


అయితే హీరోయిన్స్ కు రెమ్యునరేషన్ భారీగా ఆఫర్ చేస్తే తాము ఏదైతే చేయనని చెబుతారో అలాంటివి చేస్తారు. మిల్కీ బ్యూటీ ఆలోచన మాత్రం ఇక మీదట లేడీ ఓరియెంటెడ్ సినిమాల్లో నటించాలని అనుకుంటుంది. అభినేత్రి అలాంటి ప్రయత్నమే అయినా తెలుగు వాళ్లకు పెద్దగా ఎక్కలేదు. అందుకే తమన్నా స్పెషల్ గా అలాంటి కథలకే ప్రిఫరెన్స్ ఇస్తుందట. మరి తమన్నాకు అలాంటి సినిమా ఎవరు ఇస్తారో చూడాలి.  ఈ ఇయర్ ఎఫ్ 2 హిట్ తో జోష్ లో ఉన్న తమన్నా సైరా సినిమా మీద చాలా హోప్స్ పెట్టుకుంది.       



మరింత సమాచారం తెలుసుకోండి: