ప్రముఖ కమెడియన్ వేణు మాధవ్ మృతి చెందిన వార్త ప్రస్తుతం సిని వర్గాల్లో విషాద ఛాయలు అలముకున్నాయి. కమెడియన్, హీరో, నిర్మాత ఇలా తెలుగు సినిమా పరిశ్రమలో వేణు మాధవ్ తన వంతుగా ప్రేక్షకులను అలరిస్తూ వచ్చాడు. సూర్యపేట జిల్లా కోదాడలో జన్మించిన వేణు మాధవ్ చిన్నప్పటి నుండి డ్యాన్సులు, మిమిక్రీ చేయడం అలవాటు చేసుకున్నాడు.     


ఆయన చేసిన మిమిక్రీనే అతనికి సినిమా అవకాశాన్ని తెచ్చి పెట్టింది. రవీంద్ర భరతిలో ఒకసారి వేణు మాధవ్ మిమిక్రీని చూసిన ఎస్వి కృష్ణా రెడ్డి తన సినిమాలో నటిస్తావా అని అడిగారట. ఇడ్లీలు, వడలు, గుల గుల జామ్ లు అంటూ వేణు మాధవ్ పండించిన కామెడీ వారికి నచ్చడంతో 1996లో సంప్రదాయం సినిమాలో అవకాశం ఇచ్చారు.      


ఆ సినిమాలో అతని కామెడీకి మంచి పేరు వచ్చింది. ఇక ఆ తర్వాత పవన్ కళ్యాణ్ తొలిప్రేమ సినిమాలో ఆర్నాల్డ్ గా నటించారు వేణు మాధవ్. ఆ సినిమాలో అమ్మాయిలకు ఎంత కాంపిటీషన్ ఉందో చెప్పే పెద్ద డైలాగ్ ఇప్పటికి ఫేమస్. ఆ సినిమాతో పవన్ తో పాటుగా వేణు మాధవ్ కు మంచి పేరు వచ్చింది. కొన్నాళ్లుగా అనారోగ్యంతో బాధపడుతున్న వేణు మాధవ్ సికిందరాబాద్ యశోదా హాస్పిటల్ లో చికిత్స పొందుతూ తుది శ్వాస విడిచారు.


కామెడీకి కేరాఫ్ అడ్రెస్ గా ఉండే వేణు మాధవ్ అనారోగ్య కారణంగానే ఈమధ్య సినిమాలకు దూరంగా ఉన్నారు. ఇటీవల జరిగిన మూవీ ఆర్టిస్ట్ అసోషియేషన్ ఎలక్షన్స్ లో కనిపించిన వేణు మాధవ్ అప్పటికే తనని చూసిన వారంతా షాక్ అయ్యారు. 1996లో వచ్చిన సంప్రదాయం సినిమా నుండి 2017 లో వచ్చిన రుద్రమదేవి వరకు తెర మీద కనిపించినంతసేపు ప్రేక్షకులకు నవ్వించాలనే తపనపడే వేణు మాధవ్ ఇప్పుడు అందరిని ఏడిపిస్తూ తిరిగిరానిలోకాలకు వెళ్లారు.    
 


మరింత సమాచారం తెలుసుకోండి: