డైనమిక్ డైరెక్టర్ పూరి, ఎనర్జిటిక్ హీరో రామ్  కాంబినేషన్ లో వచ్చిన 'ఇస్మార్ట్ శంకర్' సినిమా సూపర్ హిట్ అయ్యింది.    ప్రపంచవ్యాప్తంగా 75 కోట్లకు పైగా వసూళ్లు సాధించి అబ్బురపరిచింది ఈ మాస్ ఎంటర్ టైనర్.  రామ్ ని  ఊర మాస్ తెలంగాణా పోరగాడిగా  ఓ రేంజ్ లో తెర పై  ప్రెజెంట్ చేశాడు పూరి. మొత్తానికి ఈ విజయంతో దర్శకుడు పూరి జగన్నాథ్, హీరో రామ్ ఇద్దరూ తమ పరాజయాల పరంపర నుండి బయటపడ్డారు.  ముఖ్యంగా పూరి.  ఈ విజయం ఆయనలో కొత్త ఉత్సాహాన్ని నింపింది. వరుసగా సినిమాల్ని ఓకే చేసుకుంటున్నారు. అయితే తాజాగా పూరి తీసుకున్న ఓ నిర్ణయం మాత్రం ఆశ్చర్యపరుస్తోంది. ఈ నెల 28న పూరి పుట్టినరోజు.  ఈ సందర్బంగా 'ఇస్మార్ట్ శంకర్' చిత్రాన్ని తెలుగు రాష్ట్రాల్లోని కొన్ని చోట్ల రీరిలీజ్ చేయడానికి పూరి అండ్ టీమ్ సన్నాహాలు చేస్తోందట.  ఈ మేరకు డిస్ట్రిబ్యూషన్ వర్గాలతో చర్చలు జరుగుతున్నాయట.  ఈ రీరిలీజ్ వ్యవహారం పై రేపో, ఎల్లుండో అధికార ప్రకటన వెలువడే అవకాశాలున్నాయని ఫిల్మ్ నగర్ వర్గాలు చెబుతున్నాయి. ఎంత హిట్ అయితే మాత్రం రీరిలీజ్ అవసరమా  పూరి ? అని కొంతమంది పెదవి విరుస్తున్నారట. పైగా పూరి పుట్టినరోజుకు సప్రైజ్ ఉంటుందని ఆయన నిర్మాణ సంస్థ వెల్లడించింది.  ఆ సప్రైజ్ ఈ రీరిలీజేనట.  మరి ఈ సారి ఇస్మార్ట్ శంకర్ ఆకట్టుకుంటాడో లేక డిజిటిల్ మీడియా ప్రభావంతో చేతులు ఎత్తేస్తాడో చూడాలి.   

   

కాగా ఈ చిత్రంలోని ఓ వీడియో సాంగ్ ఇప్పుడు యూట్యూబ్ లో సంచలనంగా మారిన విషయం తెలిసిందే. హీరో రామ్, హీరోయిన్లైనా నిధి అగర్వాల్, నభా నటేష్ కాంబినేషన్ వచ్చే 'దిమాక్ ఖరాబ్' సాంగ్ కేవలం విడుదలైన నాలుగు రోజులలో 10మిలియన్స్ వ్యూస్ సాధించి ట్రెండింగ్ లో కొనసాగుతుంది.  మణిశర్మ సంగీతం అందించిన ఈ పాట ప్రేక్షకుల్లో విపరీతమైన క్రేజ్ సొంతం చేసుకుంది.  థియేటర్లో బీ, సీ సెంటర్ల చేత స్టెప్పులు వేయించిన ఈ పాట సినిమా విజయంలో కీలక పాత్ర పోషించింది.  లిరిక్స్, సంగీతం, చిత్రీకరించిన విధానం అన్నీ చక్కగా కుదరడంతో పాటకు బాగా కనెక్ట్ అయ్యారు ఆడియన్స్.  ముఖ్యంగా మణిశర్మ అందించిన మాస్ బీట్ కి రామ్ ఎనర్జిటిక్ స్టెప్స్ అలాగే నాభా నటేష్, నిధిల హాట్ సెట్స్ తోడవ్వడంతో పాట ఓ రేంజిలో పేలింది.  ఇక  పూరి జగన్నాథ్ ప్రస్తుతం  తన తరువాత సినిమాని సెన్సేషనల్ హీరో విజయ్ దేవరకొండతో చెయ్యబోతున్న సంగతి తెలిసిందే.  అయితే ఇటివలే ఈ సినిమా టైటిల్ ఇదేనంటూ సోషల్ మీడియాలో  'ఫైటర్' అనే  టైటిల్ పెట్టినట్లు వార్తలు వచ్చాయి. కాగా తాజాగా ఈ టైటిల్ నే చిత్రబృందం ఫైనల్ చేసినట్లు తెలుస్తోంది.  అలాగే ఈ సినిమా షూటింగ్ డిసెంబర్  నుండి మొదలుకానుందని తెలుస్తోంది.   


మరింత సమాచారం తెలుసుకోండి: