వేణుమాధవ్ ఆకస్మిక మృతితో  టాలీవుడ్ విషాదంలో మునిగిపోయింది. చిన్న వయసులోనే వేణుమాధవ్ కన్నుమూయడంతో ఆయన అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు. కమెడియన్ గా సినిమా ఇండస్ట్రీకి ప్రవేశించిన వేణుమాధవ్ ... అంచలంచలుగా ఎదుగుతూ నెంబర్ వన్ కమెడియన్ స్థాయికి చేరుకున్నాడు. కొన్ని వందల సినిమాల్లో తనదైన కామెడీని పండించి ప్రేక్షకులకు వినోదాన్ని పంచాడు  వేణుమాధవ్. 

 

 

 

 అయితే గత కొంత కాలంగా అనారోగ్యంతో  బాధపడుతున్న వేణుమాధవ్ పరిస్థితి విషమించడంతో సికింద్రాబాద్ యశోద హాస్పిటల్ లో చేరి చికిత్స పొందుతూ మరణించారు. వేణుమాధవ్ ఆకస్మిక మరణంతో టాలీవుడ్ ఒక్కసారిగా మూగబోయింది. తనతో ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకుంటూ పలువురు నేతలు బాధాతప్త హృదయాలతో వేణు మాధవ్ మృతికి  సంతాపం తెలియజేస్తున్నారు. ఇక వేణు మాధవ్ కి అతి సన్నిహితులైన ఆలీ రాజశేఖర్ లాంటి వారైతే కన్నీటి పర్యంతం అవుతున్నారు. 

 

 

 అయితే వేణుమాధవ్ ఇంకో మూడు రోజులు బతికి ఉంటే బాగుండేది అని అభిమానులు బాధపడుతున్నారు. ఎందుకంటే సెప్టెంబర్ 28న వేణుమాధవ్ పుట్టినరోజు. ఇంకో మూడు రోజులు ఆగి ఉంటే వేణుమాధవ్  పుట్టినరోజును హ్యాపీగా జరుపుకునే వాళ్లమని...  ఆయన ఆకస్మిక మృతి అందరినీ కలిసి వేస్తోందని అభిమానులు విషాదంలో మునిగిపోయారు. తమ అభిమాన హాస్య నటుడు వేణు మాధవ్ బ్రతికి ఉంటే ఇంకో మూడు రోజుల తర్వాత హ్యాపీగా పుట్టినరోజులు జరుపుకునే వాళ్ళం  కానీ ఇప్పుడు వేణుమాధవ్ జయంతిని జరపాల్సి ఉందని ఆయన అభిమానులు సన్నిహితులు కుటుంబ సభ్యులు విషాదం వ్యక్తం చేస్తున్నారు.కాగా  మౌలాలి లో వేణుమాధవ్ అంతిమ  సంస్కారాలు జరగనున్నాయని  పేర్కొన్నారు కుటుంబ సభ్యులు.

మరింత సమాచారం తెలుసుకోండి: