ప్రముఖ టాలీవుడ్ హాస్య నటుడు వేణుమాధవ్ తన ఆకట్టుకునే నటనతో తెలుగు ప్రేక్షకుల గుండెల్లో చెరగని ముద్ర వేశారు. సూపర్ స్టార్ కృష్ణ గారి సంప్రదాయం అనే సినిమాతో టాలీవుడ్ కి నటుడిగా ఎంట్రీ ఇచ్చిన వేణు మాధవ్, ఆ తరువాత ఆరు వందలకు పైగా సినిమాల్లో నటించి తెలుగు ప్రేక్షకులను తన హాస్యపు జల్లులతో అలరించారు. ఇక రెండు రోజుల క్రితం కిడ్నీల వ్యాధితో అకాల మరణం పొందిన వేణుమాధవ్ కు టాలీవుడ్ పరిశ్రమకు చెందిన అనేక మంది నటులు నివాళులు అర్పిస్తున్నారు. ఇక నేటి మధ్యాహ్నం ఆయన పార్థివ దేహాన్ని ఫిలిం ఛాంబర్ లో అభిమానుల సందర్శనార్ధం వుంచి, కాసేపటి క్రితం శాస్త్రోక్తంగా ఆయన్ను దహనం చేయడం జరిగింది. ఇకపోతే చివరి రోజుల్లో వేణుమాధవ్, సికింద్రాబాద్ లోని యశోద ఆసుపత్రిలో తన వ్యాధికి చికిత్స తీసుకున్న విషయం తెలిసిందే. 

అయితే అందు నిమిత్తం ఆయన హాస్పిటల్ బిల్లు కూడా లక్షల్లో అయిందట. ఇక కాసేపటి క్రితం వేణుమాధవ్ అంత్యక్రియల సందర్భంగా మీడియాతో మాట్లాడిన ప్రముఖ నటి జీవిత రాజశేఖర్, వేణుమాధవ్ గారు చివరి రోజుల్లో అనారోగ్యంతో చాలా ఇబ్బదులు పడ్డారని అన్నారు. డాక్టర్లు ఎంత ప్రయత్నించినప్పటికీ వారు మనకు దక్కకపోవడం బాధాకరమని, టాలీవుడ్ పరిశ్రమకు వారు లేని లోటు తీర్చలేనిదని అన్నారు. ఇక ఆయన మరణించిన రోజున హాస్పిటల్ ఖర్చు దాదాపుగా మూడు లక్షలు అయిందని, అయితే ఆయనకు ఇన్సురెన్సు వంటివి ఉన్నాయి కానీ, ఇప్పటికిపుడు డబ్బు అడిగి వారి ఇంట్లో వాళ్ళని ఇబ్బందిపెట్టడం ఇష్టంలేక, నేను, రాజశేఖర్ గారు, ఉత్తేజ్ గారు, శివాజీరాజా గారు తదితరులం కలిసి అడ్జస్ట్ చేద్దాం అనుకున్నాం అని అన్నారు. 

అయితే అంతకముందు రెండు సార్లు హాస్పిటల్ కి వచ్చి వేణుమాధవ్ గారిని పరామర్శించిన రాష్ట్ర సినిమాటోగ్రఫీ మంత్రి శ్రీ తలసాని శ్రీనివాస్ యాదవ్ గారు, వేణుమాధవ్ గారి మరణ వార్తను విన్న వెంటనే ఆసుపత్రికి చేరుకొని హాస్పిటల్ సిబ్బందితో మాట్లాడి, బిల్లులో ఒక లక్ష రూపాయలు కన్సెషన్ ఇప్పించి, మిగతా రెండు లక్షలు బిల్ తానే స్వయంగా కట్టారని అన్నారు. అంత గొప్ప మనసున్న వ్యక్తి మన రాష్ట్రానికి మంత్రిగా ఉండడం మన అదృష్టం అని జీవిత, తలసాని గారిని పొగిడారు. ఇక ఈ విషయం తెలుసుకున్న పలువురు ప్రజలు, తలసాని గారి గొప్ప మనసుపై ప్రశంశలు కురిపిస్తున్నారు......!!  


మరింత సమాచారం తెలుసుకోండి: