మ్యూజిక్ ,నటీనటుల పెర్ఫార్మన్స్ ,సప్తగిరి మరియు తాగుబోతు రమేష్ కామెడీ మ్యూజిక్ ,నటీనటుల పెర్ఫార్మన్స్ ,సప్తగిరి మరియు తాగుబోతు రమేష్ కామెడీ క్లైమాక్స్ ,సందీప్ యాక్షన్ సీక్వెన్స్ ,ఎమోషనల్ సీన్స్ ఎమోషనల్ గ లేకపోవడం కుటుంబం కన్నా క్రమ శిక్షణ ముఖ్యం అని నమ్మే వ్యక్తి రామ్మూర్తి (నాగినీడు) తనకు తాను ఒక చట్టాన్ని పెట్టుకుంటాడు అదేంటంటే వంద తప్పులు దాటితే తన కుటుంబంలో నుండి ఎవరయినా బయటకు వెళ్ళిపోవలసిందే. అలంటి రామమూర్తి కొడుకు అయిన సందీప్ అప్పటికే తొంబై తొమ్మిది తప్ప్పులు చేసుంటాడు మరొక తప్పు చేస్తే ఇంట్లో నుండి వెళ్ళిపోవాలని తెలిసిన సందీప్ జాగ్రత్తగా ప్రవర్తిస్తుంటాడు అలంటి సమయంలో సందీప్ అన్న అయిన బ్రహ్మాజీ కి తిరుపతి లో పెళ్లి నిశ్చయం అవుతుంది. పెళ్ళికి బయలుదేరిన సందీప్ వేంకటాద్రి ఎక్ష్ప్రెస్స్ ని మిస్ అవుతాడు..ఎలాగయినా తిరుపతి చేరుకోవాలని సందీప్ ప్రయాణం మొదలు పెడతాడు. ఆ ప్రయాణంలోనే అతనికి ప్రార్థన (రకుల్ ప్రీత్ సింగ్) పరిచయం అవుతుంది. ఆ ప్రయాణంలో సందీప్ నూరవ తప్పు చెయ్యకుండా పడిన ఇబ్బందులేంటి? అన్నయ్య పెళ్లి సమయానికి సందీప్ తిరుపతి చేరుకోగాలిగాడా? ఈ ప్రయాణంలో నూరవ తప్పు చేసాడా? అన్నది తెర మీద చూడవలసిన అంశాలు.. సందీప్ కిషన్ పాత్రకు తగ్గ ప్రదర్శన కనబరిచాడు ముఖ్యంగా కీలక సన్నివేశాలలో చాలా బాగా నటించి పాత్రకు బలం చేకూర్చాడు. రకుల్ ప్రీత్ సింగ్ చూడటానికి బాగుంది కొన్ని కామెడీ సన్నివేశాలలో బాగానే నటించినా ఎమోషనల్ సన్నివేశాలు వచ్చేసరికి తేలిపోయింది.నాగినీడు మరియు బ్రహ్మాజీ పాత్రకు తగ్గ ప్రదర్శన కనబరిచారు. సప్తగిరి మరియు తాగుబోతు రమేష్ పండించిన కామెడీ థియేటర్ లో నవ్వులు పూయించాయి కాని మిగిలిన కమెడియన్స్ ఆకట్టుకోలేకపోయారు ఎం ఎస్ నారాయణ పాత్రా మరియు పృథ్వీ పాత్రలను ఇంకా బాగా తెరకెక్కించి ఉండాల్సింది. ఈ చిత్రానికి మంచి టెక్నీషియన్స్ పని చేసారు ఇవన్ని కూడా దర్శకుడు మేర్ల పాక గాంధీ కి చాల సహాయపడ్డాయి. ఒక చిన్న లైన్ ని కథగా ఎంచుకున్న గాంధీ కథనం విషయంలో మరింత జాగ్రత్త వహించి ఉండాల్సింది మొదటి అర్ధ భాగం బాగానే ఉన్న రెండవ అర్ధ భాగం బాగా నెమ్మదిస్తుంది. ఇక మాటలు దర్శకత్వం విషయంలో బాగానే హేండిల్ చేసారు. ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ అందించిన చోట కే నాయుడు కొన్ని సన్నివేశాలలో చాలా బాగా చిత్రీకరించిన అయన మార్క్ సినిమాటోగ్రఫీ చాలా తక్కువగా కనిపిస్తుంది. ఇక సంగీతం విషయనికి వస్తే రమణ గోగుల అందించిన సంగీతం మరియు నేపధ్య సంగీతం రెండు బాగానే ఉన్నాయి. నిర్మాణ విలువలు చాలా బాగున్నాయి. సందీప్ కిషన్ చిత్రం అనగానే విభిన్నంగా ఉంటుంది అన్న మార్క్ వచేసింది ఆ అంచనాలకు తగ్గట్ట్టుగానే ఈ చిత్రం కూడా కాస్త విభిన్నంగా ఉంటుంది. కాని ఈ చిత్రంతో వచ్చిన సమస్యల్లా దర్శకుడు గాంధీ, చెప్పలనుకున్నదే సన్నని ప్లాట్ దానిలో డబ్బై శతం మొదటి భాగంలో చెప్పేసి ముప్పై శాతం క్లైమాక్స్ కోసం దాచేశారు ఇక రెండవ అర్ధ భాగంలో చెప్పడానికి ఎం లేక టైం పాస్ సన్నివేశాలతో గడిపారు. క్లైమక్స్ సన్నివేశాల దగ్గర బొమ్మరిల్లు తలపించినా కూడా ఆ స్థాయిలో చిత్రీకరించాలేకపోయారు ముఖ్యంగా అక్కడ పడాల్సిన డైలాగ్స్ పడలేదు, ఆడియన్స్ కి ఇది చెప్పడానికి ఇంత సేపు పట్టిందా అనిపించేస్తుంది. దర్శకుడు పూర్తిగా విఫలం కాలేదు కాని సరిగ్గా ఆకట్టుకోలేకపోయాడు, మంచి పాయింట్ అయితే ఉంది కాని సరిగ్గా నేరేట్ చెయ్యలేకపోయారు. ఇక సెకండ్ హాఫ్ లో ప్యాడింగ్ కోసం వచ్చ్హ్సిన పాత్రలు పెట్ట్టే టార్చర్ అంత ఇంతా కాదు కామెడీ చెయ్యకపోగా బోనస్ కింద విసుగు పుట్టించాయి. సరిగ్గా చెప్పాలంటే మొదటి అర్ధ భాగంలో పట్టాల మీద నేమ్మ్మదిగానే కదిలిన వేంకటాద్రి ఎక్ష్ప్రెస్స్ రెండవ అర్ధ భాగం వచ్చే సరికి పట్టాలు తప్పింది .. వీకెండ్ బోర్ కొట్టి మరో పనిలేక సినిమా చూడాలి అనుకుంటే ఒకసారి ప్రయత్నించ దగ్గ చిత్రం ఇది........ Sundeep Kishan,Rakul Preet Singh,Merlapaka Gandhi,Gemini Kiran,Ramana Gogula పట్టాలు తప్పిన వెంకటాద్రి ఎక్స్ ప్రెస్

మరింత సమాచారం తెలుసుకోండి: