మమ్ముట్టి ప్రధాన పాత్ర పోషిస్తున్న మలయాళ 'మమంగమ్‌' చిత్రం టీజర్‌ శనివారంనాడు విడుదలైంది. బాహుబలి తరహాలో యుద్ధసన్నివేశాలు, రాజరిక వ్యవస్థకు చెందిన సన్నివేశాలు ఇందులో వున్నాయి. కేరళలో సాముత్రీ, వల్లువకోనత్రి అనే రెండు రాజ్యాలమధ్య జరిగిన కథగా తెరకెక్కించారు. భరత్‌పూజ అనే నది పరివాహక ప్రాంతంలో 'మమంగమ్‌' అనేది 12 ఏళ్ళకు ఒకసారి నదికి రెండు వైపుల ప్రాంతాలు జరుపుకునే పండుగ. ఈ పండుగను ఆచారం ప్రకారం బల్లువకోనాత్రి రాజు నిర్వహిస్తుంటాడు. కానీ మరో రాజు దాన్ని వ్యతిరేకిస్తాడు. ఆ క్రమంలో కొన్ని వందలమంది సైనికులు ఆత్మత్యాగానికి సిద్ధమవుతారు. అందుకు కారణాలు ఏమిటి అనేవి వాస్తవ కథను సినిమాటిక్‌గా రూపొందించామని దర్శకుడు తెలియజేస్తున్నారు. ఈ చిత్రాన్ని 50కోట్లతో తెరకెక్కించారు. మమ్ముట్టి, ఉన్ని ముకుందన్‌, కనిషా, అను సితార, సిద్దికీ తదితరులు ప్రధాన తారాగణం. దర్శకత్వం: పద్మకుమార్‌, సంగీతం: ఎం. జయచంద్రన్‌, నిర్మాత: వేణు కునపల్లి.


1695 వ శతాబ్ధంలో జరిగిన యదార్థ సంఘటనల ఆధారంగా ఈ సినిమా తెరకెక్కుతుంది. విజువల్స్, ఆర్ఆర్, యాక్షన్ సీక్వెన్సెస్ బాగున్నాయి. ఈ ఏడాది చివర్లో విడుదల చెయ్యడానికి సన్నాహాలు చేస్తున్నారు. ప్రాచీ తెహ్లాన్, ఉన్ని ముకుందన్, సిద్దిఖీ, అచ్యుతన్, అను సితార, తరుణ్ అరోరా, సుదేవ్ నాయర్, మణి కందన్, సుదేవ్ నాయర్ తదితరులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు.


సినిమాల పట్ల నాకు ఉన్న తపన అలాంటిది’’ అన్నారు మలయాళ స్టార్‌ మమ్ముట్టి. మహానేత వైఎస్‌ రాజశేఖర రెడ్డి జీవితంలోని పాదయాత్ర ఘట్టం ఆధారంగా రూపొందిన చిత్రం ‘యాత్ర’. వైఎస్సార్‌ పాత్రలో మమ్ముట్టి నటించారు. మహి వి.రాఘవ్‌ దర్శకత్వంలో శివ మేక సమర్పణలో విజయ్‌ చిల్లా, శశి దేవిరెడ్డి నిర్మించారు. ఈ నెల 8న సినిమా విడుదలవుతున్న  సందర్భంగా మమ్ముట్టి చెప్పిన విశేషాలు.


మరింత సమాచారం తెలుసుకోండి: