తెలుగు లో వస్తున్న బిగ్గెస్ట్ కమెడియన్ షో ‘జబర్తస్త్’. ఈ ‘జబర్తస్త్’ గత ఆరు ఏళ్ల క్రితం మొదలైన ఈ ‘జబర్తస్త్’ షో లో ఎంతో మంది కమెడియన్లు తమ అదృష్టాన్ని పరీక్షించుకున్నారు.  ఈ కామెడీ షో ద్వారా పరిచయం అయిన వేణు, ధన్ రాజ్, తాగుబోతు రమేష్, షకలక శంకర్, చమ్మక్ చంద్రలాంటి వారు టాలీవుడ్ లో కమెడియన్లు గా సెటిల్ అయ్యారు.  ప్రస్తుతం మరికొంత మంది కమెడియన్లు కూడా లైన్లో ఉన్నారు.  అయితే షకలక శంకర్ హీరోగా కూడా నటిస్తున్నారు.  ‘జబర్తస్త్’లో సుడిగాలి సుధీర్ కూడా ప్రస్తుతం సాఫ్ట్ వేర్ సుధీర్ మూవీతో హీరోగా మారారు. 

‘జబర్తస్త్’ అంటే వెంటనే గుర్తుకు వచ్చేది ఆది,రైజింగ్ రాజ్.  వీరిద్దరి కాంబినేష్ లో వచ్చే స్కిట్స్ కడుపుబ్బా నవ్విస్తాయి.  అభి ద్వారా ‘జబర్తస్త్’ పరిచయం అయిన ఆది తర్వాత తన సొంతంగా టీమ్ లీడర్ గా ఎదిగాడు.  హైపర్ ఆది టీమ్ లో రైజింగ్ రాజు, దొరబాబు వీరిద్దరితోనే ఎన్నో సూపర్ స్కిట్స్ కొట్టారు.  తాజాగా ‘జబర్తస్త్’ రైజింగ్ రాజు ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. తన జీవితంలో ఎన్నో ఇబ్బందులు పడ్డానని.. ఈ స్థాయి రావడానికి ‘జబర్తస్త్’ ఎంతో దోహదపూడిందని అన్నారు. తన  డైలాగ్ డెలివరీతో .. బాడీ లాంగ్వేజ్ తో ఆయన టెలివిజన్ ప్రేక్షకులను నవ్వించేస్తుంటాడు.  'మాది తూర్పు గోదావరి జిల్లా రామచంద్రపురం .. ఆరవ తరగతి తరువాత నాకు చదువబ్బలేదు.

దాంతో ఓ కిరాణా కొట్లో పనిచేస్తూ, చుట్టుపక్కల జరిగే సినిమా షూటింగ్స్ చూడటానికి వెళుతూ ఉండేవాడిని. తనకు చిన్నప్పటి నుంచి సినిమాలంటే విపరీతమైన క్రేజ్ అని ఉండేదని ఎన్టీఆర్,ఏఎన్ఆర్, చిరంజీవి లాంటి సినిమాలు చూస్తూ పెరిగానని అన్నారు. మా చుట్టుపక్కల ఎక్కడ షూటింగ్ జరిగినే అక్కడ ప్రత్యక్షం అయ్యేవాడిని.  కిరాణ షాప్ లో పనిచేస్తే డబ్బులు వచ్చేవి.. అలాంటి పరిస్థితుల్లో మా అన్నయ్య నూతన్ ప్రసాద్ గారి దగ్గర అసిస్టెంట్ గా చేరాడు.

నేను కూడా చెన్నై వెళ్లి అక్కడ ఆఫీస్ బాయ్ గా పనిచేస్తూ ఉండేవాడిని. అప్పుడు దర్శకుడు వేజెళ్ల సత్యనారాయణగారితో పరిచయం కావడంతో, ఆయన అప్పగించిన పనులు చేస్తూ ఉండేవాడిని...అదే నా జీవితాన్ని మార్చింది.  ఆ సమయంలోనే చిన్నా చితకా పాత్రలు వేసేవాడిని. అలా నటన విషయంలో ఆసక్తి .. అనుభవం పెరుగుతూ వచ్చాయి  అని చెప్పుకొచ్చాడు.  ఆరేళ్ల క్రితం జబర్దస్త్ తో తన అదృష్టం మారిపోయిందని అన్నారు. 


మరింత సమాచారం తెలుసుకోండి: