బిగ్ బాస్ లో ఈ వారం ఎలిమినేషన్ టైమ్ రానే వచ్చింది. నామినేషన్ లో ఉన్న నలుగురిలో  శనివారం వరుణ్ సేవ్ అయ్యాడు. ఇక మిగిలిన ముగ్గురిలో ఎవరో ఒకరు ఎలిమినేట్ అవుతారు.  అయితే ఆ ముగ్గురిలో  ఎవరు ఎలిమినేట్ అవుతారనేది ఆసక్తికరంగా మారింది. శ్రీముఖికి మొదటి నుండి మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. అంతే కాదు హౌస్ లో ఒంటరి అయిపోయిందన్న ఫీలింగ్ జనాల్లో కలిగింది. బాబా భాస్కర్, రవికి మాత్రం గట్టి పోటీ ఉండనుంది.


రవిక్రిష్ణ సీరియల్ యాక్టర్ అవడం వల్ల అతనికి ఫ్యామిలీ ఆడియెన్స్ చాలా మంది ఉన్నారు.  అతని పర్ ఫార్మెన్స్ అంత బాగాలేకపోయినా ఇన్ని రోజులు ఉన్నాడంటే కారణం వాళ్ళే. రవి టాస్క్ లలో బాగానే పార్టిసిపేట్ చేస్తాడు. టాస్క్ ని సీరియస్ గా తీసుకుని ఆడే అతికొద్ది మందిలో రవి కూడా ఒకడు. అయితే టాస్క్ లలో అతని ఆట బాగానే ఉన్నా ఏదైనా విషయంలో ఒకవైపు స్టాండ్ తీసుకుని తన వాదనని వినిపించలేకపోతున్నాడు.  ఏ విషయంలో కూడా అతను కరెక్ట్ గా వాదించినట్టు కనబడలేదు. అయితే హౌస్ అందరిలో మంచి వాడిగా పేరు తెచ్చుకున్న రవి మంచివాడిగానే ఇంటి నుండి వెళ్ళిపోయే అవకాశాలు కనిపిస్తున్నాయి.


ఇకపోతే బాబా భాస్కర్ రవికి గట్టి పోటీని ఇస్తున్నాడు. బాబా కూడా తన వాదనని వినిపించడు. ఒకవైపు స్టాండ్ తిసుకుని మాట్లాడడు. వీరిద్దరూ తమని తాము డిఫెండ్ చేసుకోలేరు. అలాగే ఎదుటి వారిపై అటాక్ చేయలేరు. ఈ కారణంగానే వీరిద్దరూ ఎలిమినేషన్ లో ముందు వరుసలో ఉన్నారు. అయితే ఎంటర్ టైన్ మెంట్ విషయంలో బాబా భాస్కర్ ఒక మెట్టు పైనే ఉన్నాడు. రవిలో ఈ క్వాలిటీ లేదు. అందుకని బాబా సేవ్ అయ్యి రవి ఎలిమినేట్ అయినట్లుగా తెలుస్తుంది. 



మరింత సమాచారం తెలుసుకోండి: