మెగాస్టార్ చిరంజీవి సురేందర్రెడ్డి దర్శకత్వంలో.... తన సొంత కొడుకు రామ్ చరణ్ నిర్మాణంలో తెరకెక్కించిన చిత్రం 'సైరా' నేడు ప్రపంచ వ్యాప్తంగా విడుదలైన సంగతి తెలిసిందే. అతి భారీ బడ్జెట్ తో తెరకెక్కిన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర ఒక రకంగా బోల్తా కొట్టింది అనే చెప్పాలి. సినిమాల్లో కేవలం ఎలివేషన్స్ కోసం కథ సజావుగా సాగకుండా ఉండడం మరియు కమర్షియల్ ఎలిమెంట్స్ కూడా చిత్రానికి పెద్ద మైనస్ లు అయి కూర్చున్నాయట. అయితే తాజాగా వెలుగులోకి వచ్చిన విషయం ఏమిటంటే సినిమా విడుదల సమయం నుంచి భారతదేశపు మొట్టమొదటి ఉద్యమకారుడు… దేశంలోనే మొట్టమొదటి సారి స్వాతంత్ర సమర భేరీ మోగించాడు యోధుడు అని కీర్తిస్తున్న ఉయ్యాలవాడ నరసింహారెడ్డికి సంబంధించిన చరిత్రను వీరు చాలా వరకు తప్పుగా చూపించారట.

ఆంధ్రప్రదేశ్ లో 19 వ శతాబ్దం లో బ్రిటీష్ వారికి వ్యతిరేకంగా దండెత్తిన మొదటి ఉద్యమకారుడు అని చెప్పబడే సైరా నరసింహారెడ్డి అసలు ఆ సమయంలో స్వాతంత్రం కోసం ఈ పోరాటాలు చేయలేదట. ఈ తతంగమంతా జరిగింది 1846లో కాగా ఆ సమయానికి అసలు 'భారతదేశం'...'భరత మాత... 'స్వాతంత్రం' అనే అంశాలపై చర్చే లేదట. పాళెగాళ్ల కుటుంబానికి చెందిన సైరా నరసింహారెడ్డి అతని తండ్రికి కి ఆఖరి సంతానం.మొదట బ్రిటిష్ వారు ఇక్కడికి వచ్చి తమ వ్యాపారాలను కొనసాగిస్తూ మనపై పన్నులు విధిస్తుంటే ఉయ్యాలవాడ నరసింహారెడ్డి అవేవి పెద్దగా పట్టించుకోలేదు కానీ పాళెగాళ్ల ఆధిపత్యానికి గండి కొడుతూ వాళ్ళకీ సామన్య ప్రజల లాగా వాళ్లకీ శిస్తులు విధించడం మరియు వాళ్లకు సంబంధించిన ఆస్తులను అక్రమంగా లాక్కుంటే ఉద్యంఆన్ని మొదలు పెట్టాడట.

దీనికి స్వాతంత్రం అని మసాలా కలిపి మొత్తం చరిత్రనే తిరగరాశారు మన సైరా టీం. మాతృభూమి అనే అంశాల్ని జోడించి సినిమాలో కూడా ఒకటి రెండు సార్లు చిరంజీవి 'భారత్ మాతాకీ జై' అని అనడం చరిత్రకారులు ఆశ్చర్యానికి గురిచేసింది. దేశ స్వాతంత్రం కోసం మొట్టమొదటి బీజం పడింది 1873లో. కిరణ్ చంద్ర బండోపాధ్యాయ 'భరతమాత' అనే పదాన్ని మొట్టమొదటిసారిగా బయటకు తీసుకురాగా తర్వాత బంకించంద్ర చటర్జీ 'వందేమాతరం' రాసి అప్పటి నుంచి దేశ స్వాతంత్రం అనే ఒక ఉద్యమాన్ని ముందుకు తీసుకుని వచ్చారు. ఇందుకు ఉయ్యాలవాడ నరసింహ రెడ్డి కి ఏమాత్రం సంబంధం లేకపోయినా కేవలం చిరంజీవి హీరోయిజం కోసం చరిత్రను మంటగలపడం గమనార్హం


మరింత సమాచారం తెలుసుకోండి: