సౌత్ సిని పరిశ్రమలో తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న హీరోయిన్ తమన్నా ఈమధ్య కథల సెలక్షన్స్ లో ఆచి తూచి అడుగులేస్తుంది. మిల్కీ బ్యూటీగా క్రేజ్ తెచ్చుకున్న ఈ అమ్మడు కొన్నాళ్ల క్రితం కాస్త వెనుకపడినట్టు అనిపించినా మళ్లీ ఇప్పుడు ఫాంలోకి వచ్చింది. ఈ ఇయర్ ఆల్రెడీ ఎఫ్-2తో హిట్ అందుకున్న తమన్నా రీసెంట్ గా సైరా నరసింహా రెడ్డి సినిమాతో మరో క్రేజీ హిట్ సొంతం చేసుకుంది.


సురేందర్ రెడ్డి డైరక్షన్ లో ఉయ్యాలవాడ నరసింహా రెడ్డి జీవిత కథతో వచ్చిన సైరా సినిమాను రాం చరణ్ నిర్మించాడు. ఇక ఈ సినిమాలో తమన్నా లక్ష్మి పాత్రలో నటించింది. సినిమాలో నరసింహా రెడ్డి భార్య సిద్ధమ్మగా చేసిన నయనతార కన్నా తమన్నాకే ఎక్కువ స్క్రీన్ స్పేస్ ఉందని చెప్పొచ్చు. పాత్రకు తగినట్టుగానే తమన్నా కూడా మెప్పించింది.   


ఇక ఈ సినిమా సక్సెస్ తో మెగాస్టార్ కోడలు ఉపాసన కూడా మంచి జోష్ లో ఉంది. మామ నిజమైన గ్యాంగ్ లీడర్ అంటూ ట్వీట్ చేసిన ఉపాసన. ఈ సినిమా సక్సెస్ లో భాగమైనందుకు మిల్కీ బ్యూటీ తమన్నాకు డైమండ్ రింగ్ గిఫ్ట్ గా ఇచ్చింది. ఉపాసన తనకు పంపించిన రింగ్ ను పెట్టుకుని మై గిఫ్ట్ అంటూ సంబరపడుతుంది.  


మొత్తానికి సైరా హిట్ అయినందుకు ఉపాసన కూడా చాలా సంతోషంగా ఉన్నట్టు కనిపిస్తుంది. భర్త నిర్మాత అయితే తను ప్రొడ్యూస్ చేసిన సినిమా సక్సెస్ అయితే ఎవరు సంతోషంగా ఉండరు చెప్పండి. సంతోషపడటమే కాదు తను కూడా సినిమాలో నటించిన తమన్నాకు కాస్ట్ లీ గిఫ్ట్ ఇచ్చిందంటే సినిమాపైనే కాదు భర్త మీద తనకు ఉన్న గౌరవం ఏంటో అర్ధమవుతుంది. ఈ గిఫ్ట్ ఇచ్చినందుకు మెగా ఫ్యాన్స్ కూడా ఉపాసనను మెచ్చుకుంటున్నారు. 
 


మరింత సమాచారం తెలుసుకోండి: