150 సినిమాలు చేసిన మెగాస్టర్ చిరంజీవి తన కెరియర్ లో ఇప్పటివరకు చేయని సినిమా పిరియాడికల్ మూవీ. అయితే 12 ఏళ్ల తన కలని నిజం చేశాడు రాం చరణ్. సురేందర్ రెడ్డి డైరక్షన్ లో సైరా సినిమా నిర్మించిన రాం చరణ్ తన తండ్రికి ఇంకన్నా గొప్ప గిఫ్ట్ ఇవ్వలేడని చెప్పొచ్చు. ఇక బుధవారం రిలీజైన సైరా సినిమా అన్నిచోట్ల పాజిటివ్ టాక్ తెచ్చుకుంది. 


ఇక ఈ సినిమాలో మొత్తం 4 పాటలు ఉండగా రన్ టైం కు అడ్డుగా మారుతుందని నాల్గవ పాట ట్రిం చేశారట. ఇప్పుడు ఎలాగు సినిమాకు పాజిటివ్ టాక్ వచ్చింది కనుక సినిమాకు సంబందించిన ఆ సాంగ్ కూడా రిలీజ్ చేస్తారని తెలుస్తుంది. అయితే ఇది సినిమాలో కనిపించదు కాని సినిమా ప్రమోషన్స్ కు బాగా వాడుతున్నారు.


సైరా నుండి రాబోతున్న ఈ 4వ సాంగ్ పై క్రేజ్ ఏర్పడింది. చిరంజీవి, తమన్నాల మధ్య జరిగే ఈ సాంగ్ కు భారీ ఖర్చే అయినట్టు తెలుస్తుంది. అయినా సరే సినిమా రన్ టైం కు ఇబ్బందిగా మారినప్పుడు చెప్తే బాగుండేది. డెలీట్ సీన్స్ అంటూ యూట్యూబ్ ఛానెల్స్ లో రిలీజ్ చేస్తున్నారు. అసలైతే ఓ మంచి సాంగ్ సినిమాలో మిస్ అయినట్టే అంటున్నారు చిత్రయూనిట్.


ఆల్రెడీ టాక్ అటు ఇటుగా ఉన్న సినిమాకు మళ్లీ రిపీటెడ్ ఆడియెన్స్ కావాలి కనుక ఈ డెలీటెడ్ సీన్స్ యాడ్ చేస్తున్నారట. సైరా సక్సెస్ జోష్ లో ఉన్న మెగాస్టార్ తన తర్వాత సినిమా కొరటాల శివతో చేస్తున్నారు. ఆ సినిమాలో చిరంజీవి డ్యూయ్ల్ రోల్ చేస్తాడని తెలుస్తుంది. ఆ సినిమాను కూడా కొణిదెల ప్రొడక్షన్స్ బ్యానర్ లో తెరకెక్కనుంది. ఈ సినిమా బడ్జెట్ కూడా భారీగా ఉండనుంది. 
 
 


మరింత సమాచారం తెలుసుకోండి: