మెగాస్టార్ చిరంజీవి హీరోగా సురేందర్ రెడ్డి దర్శకత్వంలో నయనతార హీరోయిన్ గా నటించిన తాజా సినిమా సైరా నరసింహారెడ్డి. ఇక షూటింగ్ ప్రారంభం నాటి నుండి మొన్నటి రిలీజ్ వరకు రోజురోజుకు విపరీతమైన అంచనాలు పెంచేసిన ఈ సినిమా, ఎట్టకేలకు మొన్నటి గాంధీ మహాత్ముని 150వ జయంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు రావడం జరిగింది. అయితే ఎన్నో అంచనాల మధ్య రిలీజ్ అయిన ఈ సినిమా ప్రేక్షకుల అంచనాలు  పూర్తి స్థాయిలో అందుకోలేక పర్వాలేదనిపించేలా యావరేజ్ టాక్ ని మాత్రమే సంపాదించగలిగింది. ఇకపోతే తొలి రోజు బాగానే ఓపెనింగ్స్ ని రాబట్టిన ఈ సినిమా, రెండవ రోజు నుండి మెల్లగా నత్తనడకన ముందుకు సాగుతోంది. మెగాస్టార్ తొలిసారి ఒక స్వతంత్ర సమరయోధుడి పాత్రలో నటించిన ఈ సినిమాలో అమితాబ్, విజయ్ సేతుపతి, 

జగపతి బాబు, సుదీప్, రవి కిషన్, రఘు బాబు, పృథ్వి, తమన్నా, పవిత్ర లోకేష్ తదితరులు ఇతర ముఖ్య పాత్రల్లో నటించడం జరిగింది. ఇక ఇప్పటికే చాలా చోట్ల ఈ సినిమాకు కలెక్షన్స్ తగ్గుముఖం పట్టాయని, అలానే నార్త్ మరియు ఇతర ప్రాంతాలలో అయితే ఈ సినిమా ఎంతో పేలవమైన ప్రదర్శన చేస్తున్నట్లు చెప్తున్నారు ట్రేడ్ విశ్లేషకులు. ఇక వారు చెప్తున్న లెక్కల ప్రకారం, ఇప్పటివరకు ప్రపంచ వ్యాప్తంగా రూ.74 కోట్ల షేర్ ని సాధించిన సైరా సినిమా, అందులో సింహ భాగం ఉభయ తెలుగు రాష్ట్రాల నుండే సంపాదించడం జరిగిందట. అందులో మన రెండు తెలుగు రాష్ట్రాల్లో కలిపి రూ.54 కోట్లు షేర్ వసూలు చేసిందట. ఇక మిగతా ఏరియాల నుంచి కేవలం రూ.20 కోట్లు మాత్రమే రాబట్టడం ఈ సినిమాకు ప్రధాన సమస్యగా మారింది. అయితే ఈ సినిమాకు భారీ ఎత్తున జరిగిన బిజినెస్ ప్రకారం, 

సైరా బ్రేక్ ఈవెన్ కి చేరుకోవాలంటే, మొత్తంగా రూ.200 కోట్ల షేర్ వసూలు చేయగలిగితే తప్ప బయ్యర్లు ఒడ్డున పడని పరిస్థితి ఉందట. ప్రస్తుతం దసరా పండుగ, అలానే వీకెండ్ కి సెలవులు ఉండటం వలన కలెక్షన్స్ బాగానే ఉన్నా, ఆ తరువాత మాత్రం చాలావరకు అవి తగ్గే అవకాశం ఉందని అంటున్నారు. దాని ప్రకారం ఓవర్ ఆల్ గా ఈ సినిమా ఎంత ముందుకుసాగినా, రూ.125 కోట్లకు మించి షేర్ దాటడం గగనమే అని చెప్తున్నారు. మరి ఈ గండం నుండి గట్టెక్కాలంటే కేవలం తెలుగు రాష్ట్రాల నుంచే సైరా రూ.100 కోట్లకు మించి వసూళ్లు సాధించాలని, అయితే ఏదైనా అద్భుతం జరిగి కలెక్షన్స్ విపరీతంగా పెరిగితే తప్ప, చాలావరకు అది సాధ్యం అయ్యే అవకాశం లేదని అంటున్నారు. మరి సైరా రాబోయే రోజుల్లో ఎంత మేర కలెక్షన్ రాబట్టి బయ్యర్స్ ని సేవ్ చేస్తుందో చూడాలి...!!


మరింత సమాచారం తెలుసుకోండి: