టాలీవుడ్ లో నందమూరి కుర్రాళ్లు జూ.ఎన్టీఆర్, కళ్యాన్ రామ్ లు మంచి ఫామ్ లో కొనసాగుతున్నారు. స్వర్గీయ నందమూరి హరికృష్ణ తనయులు నందమూరి కళ్యాన్ రామ్, ఎన్టీఆర్ లు హీరోలుగా వెండి తెరకు పరిచయం అయ్యారు. అయితే కళ్యాన్ రామ్ హీరోగానే కాకుండా నిర్మాత గా పలు సినిమాలు తీశాడు.  ఆ మద్య సస్పెన్స్, థ్రిల్లర్ 118 మూవీతో కళ్యాన్ రామ్ మంచి విజయాన్ని అందుకున్నాడు. 


తాజాగా నందమూరి కళ్యాణ్ రామ్ హీరోగా చేస్తున్న ఎంత మంచివాడవురా సినిమా టీజర్ కొద్దిసేపటి క్రితమే రిలీజ్ అయ్యింది.  వేగేశ్న సతీష్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో మెహ్రీన్ హీరోయిన్.  నందమూరి కళ్యాణ్ రామ్ క్యారెక్టర్ ను ఎలివేట్ చేస్తూ టీజర్ ను కట్ చేశారు. ఇక టీజర్ విషయానికి వస్తే..మా మనవడు శివ మంచోళ్లకే మంచోడు.. నా కొడుకు ఆచార్య చాలా మంచోడు.. ఆ అల్లుడు బాలు ఎంతో మంచోడో. నా హీరో బాలు చాలా మంచివాడు. మా అన్నయ్య రిషి ఎంతో మంచోడో..' అంటూ ఎవరికి తోచిన పేరు వారు పెట్టుకుని, వరుస కలిపేస్తూ, 'మంచోడు' అనే పాయింట్‌ని కామన్‌గా రైజ్‌ చేస్తున్నారు. మంచితనం ఏంటీ? అంటే, నలుగురు రౌడీల్ని పిచ్చ పిచ్చగా ఉతికి ఆరేస్తున్నాడు. అందరూ మంచోడంటున్నారు. 


నువ్వేంట్రా మీర ఇలా కొడుతున్నావ్‌.. అని ఆ రౌడీల్లో ఒకడు అడగ్గా, 'రాముడు కూడా మంచోడేరా.. కానీ రావణాసురుడ్ని ఏసేయలా..' అని కళ్యాణ్‌ రామ్‌ ఇచ్చిన పంచ్‌ డైలాగ్‌ ఆకట్టుకుంటోంది. చివర్లో కళ్యాన్ రామ్ తండ్రి తనికెళ్ల భరణి మళ్లీ ఎప్పుడొస్తావురా అనగా..సంక్రాంతికి వస్తా నాన్న అనడం.. చాలా హాయిగా, ఆహ్లాదంగా డిజైన్‌ చేశారు. పల్లెటూరి వాతావరణాన్ని కూల్ గా  బ్యాక్‌ గ్రౌండ్‌ మ్యూజిక్‌తో కట్‌ చేశారు.


మరింత సమాచారం తెలుసుకోండి: