షమిక ఎంరటర్ప్రైజెస్ పతాకంపై H.D కుమార స్వామి సమర్పణలో
రాధిక కుమార స్వామి నిర్మాతగా అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మించిన చిత్రం భైరాదేవి. ఈ చిత్రానికి కథ - స్క్రీన్ ప్లే - మాటలు పాటలు - దర్శకత్వం శ్రీజై.
హార్రర్ సస్పెన్స్ థ్రిల్లర్ తో మొట్టమొదటి సారిగా ఫీమేల్ అఘోరా కాన్సెప్ట్ తో తెరకెక్కించిన చిత్రం ఇది. రమేష్ అరవింద్, బొమ్మాలి రవిశంకర్ ముఖ్య పాత్రలు పోషించారు. బెంగుళూరు ఈ చిత్రం కోసం
కోటి నర్ర ఖర్చుతో పెద్ద సెట్ నిర్మించారు. ఈ సెట్ లో
రాధిక కుమార స్వామికి సంభందించిన కీలక సన్నివేశాలు చిత్రీకరించడం జరిగింది. ఈ చిత్రానికి దాదాపు 20 కోట్ల వ్యయంతో నిర్మిచడం జరిగింది. కన్నడ, తెలుగు, తమిళ పోస్ట్ ప్రొడక్షన్ గ్రాఫిక్స్ వర్క్స్ జరుగుతున్నాయి. త్వరలో ఆడియో విడుదల కానున్న ఈ చిత్రం నవంబర్ లో ప్రేక్షకుల ముందుకు రానుంది.
ఒకరకంగా చెప్పాలంటే లేడీ అఘోరాల పైన ఇప్పటివరకు సినిమాలు రాలేదు. ఇకమరి ఈ చిత్రం ఎలా ఉండబోతుంది. దీని కాన్సెప్ట్ ఏమిటి అన్నది తెలియాలి. హారర్ మూవీస్ ఎక్కువగా వస్తున్న తరుణంలో ఈ చిత్రం ఏ మాత్రం మెప్పిస్తుందో వేచి చూడాలి.
బ్యానర్: షమిక ఎంటర్ ప్రైజస్, నిర్మాత:
రాధిక కుమార స్వామి,రమేష్ అరవింద్,
రాధిక కుమార స్వామి, బొమ్మాలి రవిశంకర్, రంగయన రఘు,
మాళవిక అవినాష్, స్కంద అశోక్, సూచింద్ర ప్రసాద్, శివరాం. తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి కెమెరామెన్: జె. ఎస్.వాలి మ్యూజిక్: కె.కె.సెంథిల్ ప్రశాంత్, ఎడిటర్:
రవి చంద్రన్, లిరిక్స్: శ్రీజై, రామజోగయ్య శాస్త్రి, డాన్స్: మోహన్, కథ - స్క్రీన్ ప్లే - మాటలు - పాటలు - దర్శకత్వం: శ్రీజై.