చిరంజీవి 'సైరా' చిత్రం తర్వాత తన 152వ చిత్రానికి కొరటాల శివ దర్శకత్వం వహిస్తున్నారు. అయితే చిరు తన తర్వాతి ప్రాజెక్టులపై కూడా ఇప్పటి నుంచే దృష్టి సారిస్తున్న సంగతి తెలిసిందే. కొరటాల తర్వాత త్రివిక్రమ్ తో చిరు ఒక సినిమా చేయబోతున్నాడని వార్తలు వస్తున్నాయి. అయితే ఈ లోపలే మరొక అంశం తెరమీదకి వచ్చింది. చిరంజీవి మరియు అతని కుమారుడు రామ్ చరణ్ కలిసి ఒక సినిమా చేయబోతున్నారట. మోహన్ లాల్ హీరోగా నటించిన మలయాళం బ్లాక్ బస్టర్ మూవీ 'లూసిఫర్' కు ఈ చిత్రం రీమేక్ అని సమాచారం.

అయితే ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తోంది అల్లుఅర్జున్ తో ఎప్పటినుంచో మంచి సన్నిహితుడిగా ఉంటున్న సుకుమార్. తెలుగులో అగ్ర దర్శకులలో ఒకడైన సుకుమార్ 'రంగస్థలం' తో రామ్ చరణ్ కి కొత్త రూపాన్ని తీసుకొని వచ్చి అతనిని 100 కోట్ల క్లబ్ లో ఎవరికీ అందనంత ఎత్తులో నిలబెట్టాడు. ఇప్పుడు అంతటి టాలెంటెడ్ డైరెక్టర్ కి మెగాస్టార్ వెంటనే గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసి తన 153వ చిత్రం అతనితోనే చేసే అవకాశాలు ఉన్నాయని ఫిలిం వర్గాల టాక్.

ఇకపోతే రంగస్థలం హీరో రామ్ చరణ్ చనువుతోనే సుకుమార్ కి ఛాన్స్ దక్కిందని సమాచారం. చిరంజీవి తదితర ప్రాజెక్టులు అన్నీ వరుసగా కొణిదెల ప్రొడక్షన్స్ పై నిర్మించినుండగా ఈ చిత్రాన్ని కూడా అతని ఖాతాలోకే వేసుకున్నాడట. అయితే ఈ చిత్రంలో ఇంకా మెగా ఇమేజ్ కి తగ్గట్టు తెలుగు నేటివిటీకి అనువర్ణిస్తూ ఏపీ పొలిటికల్ వాతావరణానికి తగ్గట్టుగా కథను మార్చి సుకుమార్ రాయబోతున్నాడట. ప్రస్తుతానికైతే బన్నీతో సినిమాకి ప్రి-ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉన్న సుకుమార్ నుంచి కానీ మరియు కొందరు కొణిదెల హౌస్ నుండి కానీ ఎలాంటి అధికారిక సమాచారం లేదు. ఏ సమయంలో అయినా ఈ విషయాన్ని ఎవరో ఒకరు కన్ఫర్మ్ చేసినా ఆశ్చర్యపోనవసరం లేదు.


మరింత సమాచారం తెలుసుకోండి: