ఆర్ ఎక్స్ 100 సినిమా ద్వారా తెలుగు తెరకు పరిచయమైన భామ పాయల్ రాజ్ పుత్. ఈ సినిమాలో తన అందంతో కుర్రకారు మతినిపొగొట్టింది. ముద్దు సన్నివేశాలతో ప్రేక్షకులని మైమరిపించింది. అయితే ఈ సినిమాలో బోల్డ్ సీన్స్ ఉన్నప్పటికీ సినిమా పెద్ద హిట్ కావడానికి కారణం కథ. అవును ఆర్ ఎక్స్ ౧౦౦ సినిమాలో కథ ఎన్నో మలుపులు తీసుకుంటుంది. ఆ మలుపులు ప్రేక్షకులని కట్టి పడేసాయి. అందుకే అంతలా ఆకట్టుకోగలిగింది.


అయితే ఈ సినిమా తర్వాత పాయల్ చేసిన చిత్రం "ఆర్ డి ఎక్స్ లవ్". టీజర్ రిలీజ్ అయినప్పటి నుండి ఈ సినిమాపై ఎన్నో విమర్శలు వచ్చాయి. పాయల్ ఈ సినిమాలో గత సినిమా కంటే ఎక్కువ బోల్డ్ గా కనిపించే ప్రయత్నం చేసింది. ఆర్ ఎక్స్ 100 లాంటి ప్లేవర్ తో వచ్చిన ఈ చిత్రం మంచి విజయం సాధిస్తుందని భావించారు. వాళ్ళు అలా భావించడానికి గల ముఖ్య కారణం పాయల్. పాయల్ తన అందచందాలతో ప్రేక్షకులని థియేటర్లకి రప్పించగలదనే నమ్మకం వాళ్ళలో కనబడింది.



అయితే సినిమా ఈ నెల్ 11 వ తేదీన రిలీజైంది. పాయల్ రాజ్ పుత్ ప్రేక్షకులని థియేటర్లకైతే రప్పించగలిగింది కానీ మెప్పించలేకపోయింది. విడుదలైన ప్రతీ దగ్గరి నుండి ఈ సినిమాపై నెగెటివ్ టాక్ వచ్చింది. మరీ బూతు సినిమాలా ఉందంటూ కామెంట్లు వచ్చాయి. విమర్శకుల నుండి ఘోరమైన విమర్శలు ఎదురయ్యాయి. చెప్పాలనుకున్న కథని డైరెక్టుగా చెప్పకుండా అనవసర సీన్లని యాడ్ చేయడం వల్ల మొదటికే మోసం వచ్చిందని అంటున్నారు. 


ఇకపోతే ఇలాంటి సినిమాల్లో నటించడం వల్ల పాయల్ కి నష్టమే తప్పితే లాభం లేదనే మాటలు వినబడుతున్నాయి. ఆర్ ఎక్స్ 100 సినిమాలో గ్లామర్ తోనే కాదు నటనలోనూ మంచి పేరు తెచ్చుకున్న పాయల్ ఇలాంటి సినిమాల్లో నటించి పెద్ద సినిమాల్లో నటించడానికి గల అవకాశాన్ని కోల్పోయేలా చేసుకుందనే అభిప్రాయం వినబడుతుంది. ప్రస్తుతం పాయల్ నటించిన మరో సినిమా "వెంకీమామా" సంక్రాంతి కానుకగా విడుదలకు సిద్ధమవుతోంది.




మరింత సమాచారం తెలుసుకోండి: