మెగాస్టార్ చిరంజీవి రాజకీయాల నుండి సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇచ్చిన తర్వాత మెగా అభిమానులకు సైరా సినిమా తో అదిరిపోయే హిట్టు అందించారు. గత కొన్ని రోజుల నుండి బాక్సాఫీస్ దగ్గర మెగా హీరోల సినిమాలు జోరు తగ్గిందని కామెంట్స్ వస్తున్న క్రమంలో చిరంజీవి 'సైరా' సినిమా తో విజృంభించడంతో బాక్సాఫీస్ దగ్గర మోత మోగింది. దెబ్బకి ఏ నోరులు అయితే మెగా హీరోల జోరు..తగ్గిందని కామెంట్లు చేశాయో ఆ నోరులు ఇప్పుడు మూత పడిపోయాయి. చిరంజీవి సినిమా హిట్ అయితే ఎలా ఉంటుందో ప్రస్తుతం ఉన్న యువతరానికి 'సైరా' సినిమా తో రుచి చూపించాడు నిర్మాత రామ్ చరణ్ తేజ్. దేశ స్వాతంత్రం కోసం పోరాడిన పోరాట యోధుడిగా తెలుగు ప్రాంతానికి చెందిన ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవిత చరిత్ర కథ ఆధారంగా తెరకెక్కిన ఈ సినిమా అక్టోబర్ రెండవ తారీకున గాంధీ జయంతి సందర్భంగా విడుదల అవ్వడం జరిగింది.

సినిమా విడుదలైన మొదటి రోజు నుండి అద్భుతమైన కలెక్షన్లు రాబడుతోంది కళ్ళు చెదరగొట్టే రీతిలో టాలీవుడ్ బాక్సాఫీస్ దగ్గర రికార్డులు సృష్టిస్తోంది. సినిమా విడుదలైన ఫస్ట్ డే ప్రపంచవ్యాప్తంగా 85 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ సాధించి మెగా ప్రభంజనం అంటే ఎలా ఉంటుందో 'సైరా' సినిమాతో బాక్సాఫీస్‌కి రుచి చూపించిన చిరంజీవి అదే జోరుతో తన ర్యాంపేజ్‌ని కంటిన్యూ చేసాడు. కలెక్షన్స్ వర్షం కురుస్తూనే ఉంది. బాక్సాఫీస్ దగ్గర నంబర్స్ మారిపోతూ ఉన్నాయి...థియేటర్స్ ముందు హౌస్ ఫుల్ అనే బోర్డ్స్ మాత్రం కనిపిస్తూనే ఉన్నాయి. సింగిల్ స్క్రీన్స్‌లో విజిల్స్ మోతకు సినిమా సరిగ్గా వినిపించడంలేదు అని అంటున్నారు. ఆ రేంజ్‌లో ఉంది చిరంజీవి నట విశ్వరూపం. 64 ఏళ్ళ వయసులో కూడా ఆకలితో, కసితో ఉన్న యంగ్ హీరో‌లా నటించి సైరా సినిమాతో ఔరా అనిపిస్తున్నాడు మెగాస్టార్ చిరంజీవి.

దసరా సెలవులు ముగిసిన గాని చిరంజీవి నటనకు సైరా సినిమా హాలు ఇంకా నిండిపోతున్నాయి. ఈ క్రమంలో పదమూడవ రోజు కూడా మెగాస్టార్ చిరంజీవి కలెక్షన్ల విషయంలో కొన్ని కోట్లు రాబాడుతూ...సైరా జోరు కొనసాగిస్తున్నాడు. టోటల్ గా 135కోట్లకు పైగా కలెక్షన్స్ తో 12వ రోజు స్ట్రాంగ్ గా కనిపించిన సైరా పదమూడవ రోజు 181 కోట్లు కలెక్ట్ చేసి చిరంజీవి కెరీర్లో మరియు టాలీవుడ్ ఇండస్ట్రీలో ప్రభంజనం సృష్టించినట్లు లెక్కలు చెబుతున్నాయి. ఇదే జోరు రాబోయే రోజుల్లో కొనసాగితే డిస్ట్రిబ్యూటర్లకు ఇక లాభాల పంట పండినట్లే అని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి.


మరింత సమాచారం తెలుసుకోండి: