ఈ లోకంలో రంగుల ప్రపంచం ఏదైన ఉందంటే అది సినీ ప్రపంచమే. తక్కువకాలంలో ఎక్కువగా పేరు, డబ్బులను కళ్లముందు నిలిపి పదిమందిలో ప్రత్యేక స్దానాన్ని ఏర్పాటు చేస్తుంది. అప్పటివరకు ముఖం చూడనివారు కూడా ఆర్టిస్టుగా పేరు రాగానే అతను మావాడు, మా బంధువు, అని గొప్పగా చెప్పుకుని తెగ ఫీలవ్వుతారు. ఐతే ఈ రంగుల కలల ప్రపంచంలో కంటికి కనిపించని వలలెన్నో సాలెగుడులా అల్లుకుని మనిషిని కట్టిపడేస్తాయి.


ఇకపోతే ఇక్కడ మనిషికి ఎదురయ్యే అవమానాలు, ఛీదరింపులు అన్ని ఇన్ని కావు అవన్ని తట్టుకుని నిలబడ గలిగితేనే విక్టరీ దరికి చేరుతుంది. ఇంతే కాకుండా కళ్ల ముందు కష్టాలు అనే కొలిమి భగ భగ మండుతూ, అన్ని రకాలుగా ఆశలను మాడ్చేస్తుంది.. అప్పుడు ఓపికతో ముందుకు సాగితే చివరన ఆనందం అనే తేనీరు దొరుకుతుంది. ఇకపోతే జబర్దస్త్ కామెడీ షో ద్వారా క్రేజీ కమెడియన్‌గా గుర్తింపు తెచ్చుకున్న గెటప్ శ్రీను కూడా ఇలాంటి కష్టాలు ఎదుర్కొన్నానని చెబుతున్నారు. ఎన్నో చేదు అనుభవాలు తన సిని ప్రయాణంలో ఎదురయ్యాయట.


సినిమాల్లోకి రాకముందు తాను అవన్ని అనుభవించానని తెలిపారు.. ఇతను ఈ విషయాలన్ని ఓ యూట్యూబ్ ఛానెల్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూలో పంచుకున్నాడు. కెరీర్ తొలినాళ్లలో అవకాశాల కోసం ఓ అసోసియేట్ డైరెక్టర్‌కి ఫోన్ కాల్ చేశానని.. ఐతే అతడు బండ బూతులు తిట్టాడని, ఇంకోసారి తనకు ఫోన్ చేయద్దని, అతడు చివాట్లు పెట్టాడని వెల్లడించాడు గెటప్ శ్రీను. ఒక మనిషిని ఇలా కూడా తిడతారా.. అని తాను చాలా బాధపడినట్లు చెప్పాడు .


ఇకపోతే సినిమాల్లోకి రాకముందు టీవీ9, టీవీ1, జెమిని మ్యూజిక్, మా కేబుల్, సీ ఛానెల్, హై మ్యూజిక్, వనిత వంటి టీవీ చానల్లో పనిచేశానని, ఆ అనుభవం నా ఎదుగుదలకి కొంత ఉపయోగపడిందని తెలిపాడు. అన్ని కష్టాలు ఓపికతో భరించాను కాబట్టే ఈనాడు ఇలా ఉండగలిగానని పేర్కొన్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: