మెగా హీరో సాయి ధరమ్ తేజ్ రీసెంట్‌గా చిత్రలహరి సినిమాతో మంచి డీసెంట్ హిట్ ని అందుకున్నాడు. చాలా రోజుల తర్వాత తేజు కి మంచి హిట్ పడింది. న్యూమరాలజి ప్రకారం పేరులో మార్పు వల్ల వచ్చిన సక్సస్ కావొచ్చు..ఇంకేదైనా కావచ్చు గాని మొత్తానికి తేజు కి హిట్ పడింది. ఇప్పుడు ఇదే మ్యాజిక్ రిపిటవుతుందనిపిస్తుంది.సాయి ధరమ్ తేజ్-రాశి ఖన్నా జంటగా మారుతి దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా 'ప్రతిరోజూ పండగే'. కంప్లీట్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ గా ఈ సినిమాను రూపుదిద్దుకుంటోంది. ఇక తేజు పుట్టిన రోజు సందర్భంగా ఈ సినిమా ఫస్ట్ గ్లింప్స్ ను విడుదల చేశారు. ఫ్యామిలీ ఎంటర్ టైనర్  గా ఒక ఫీల్ గుడ్ టైటిల్ తో నిర్మిస్తున్న ఈ సినిమా ఫస్ట్ గ్లింప్స్ మెగా ఫ్యామిలీ తో పాటు ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటుంది. కుటుంబం అంతా కలిసి చూసే సినిమాలా ఉంటుందని రిలీజైన టీజర్ చూస్తే అర్థమవుతుంది.

ప్రతిరోజూ పండగే..అనే టైటిల్ లోనే ఒక సెలబ్రేషన్ ఉంది.  అలానే ప్రతి ఫ్రేం లో ఒక లైవ్లీ నెస్.. ఒక హ్యాపీనెస్ కనిపించేలా విజువల్స్ ఉన్నాయి. పచ్చని పొలాల మధ్య బైకుపై తాతయ్యను కూర్చోబెట్టుకుని కబుర్లు చెప్తూ తీసుకువెళుతున్న మనవడు తేజు.. మరో సీన్ లో తేజు కూల్ గా కాఫీ తాగుతూ ఉంటే ఎదురుగా కూర్చొని ఉన్న రాశి ఖన్నా.. ఇంకో సీన్ లో రావు రమేష్.. తేజు ఇద్దరూ ఫారెన్ లోకేషన్ లో సూటు బూట్లలో కాస్త వెరైటీగా ఉన్న సీన్.. వానపడుతూ ఉంటే సగం తడుస్తూ ఆటో వెనక కూర్చుని తాతయ్యతో కలిసి నవ్వుతూ పుచ్చకాయ తింటూ ఉండడం.. ఇలా ప్రతి ఫ్రేం ఒక పెయింటింగ్ లా కనిపిస్తోంది. నట్టింట్లో తాతయ్య డ్యాన్స్ ను చూసి ఎంతో ఆనందం గా నవ్వుతున్న తేజు దగ్గర ఫ్రీజ్ చేసి హ్యాపీ బర్త్ డే క్యాప్షన్ ఇవ్వడం అందరిని విపరీతంగా ఆకట్టుకుంది. కరెక్ట్ గా చెప్పాలంటే గ్లింప్స్ ఒక పర్ఫెక్ట్ ఫెస్టివల్ మాదిరిగా కనిపిస్తుంది.

ఇక థమన్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ఎంతో ఆహ్లాదకరంగా అనిపిస్తుంది. అంతేకాదు విజువల్స్ ను అంత అందంగా చూపించిన సినిమాటోగ్రఫీ బాగుంది. మొత్తంగా చూస్తే తేజు బర్త్ డే ట్రీట్ చాలా బావుందని ఫ్యాన్స్ సంబర పడుతున్నారు. మళ్ళీ తేజు కి హిట్ పడబోతోందని చెప్పుకుంటున్నారు. ఇక ఈ సినిమాతో మారుతి అకౌంట్ లోను హిట్ గ్యారెంటి అని అనుకోవచ్చు. ఏ సినిమా పోటీకి వచ్చినా ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ కాబట్టి 'ప్రతిరోజూ పండగే' పోటీని తట్టుకొని హిట్ టాక్ తెచ్చుకోవచ్చని చెప్పుకుంటున్నారు. 



మరింత సమాచారం తెలుసుకోండి: