సౌత్ కొరియోగ్రాఫర్ అండ్ డైరెక్టర్ ప్రభుదేవా దర్శకత్వంలో బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ ప్రస్తుతం 'దబాంగ్ 3'లో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా 'దబాంగ్' సీరీస్ లో మూడవ భాగంగా రూపొందుతుంది. క్రిస్మస్ సందర్భంగా దబాంగ్ 3 ప్రేక్షకుల ముందుకు రానుంది.  ఇక ఈ సినిమా తర్వాత సంజయ్ లీలా భన్సాలి దర్శకత్వంలో 'ఇన్షా అల్లా' సినిమాలో నటించేందుకు సల్మాన్ రెడీ అయ్యాడు. కానీ ఆ సినిమా అనివార్య కారణాల వల్ల ఆగిపోయింది. అయితే 'దబాంగ్ 3' తర్వాత సల్మాన్ మరోసారి ప్రభుదేవాతో పనిచేస్తున్నాడు. 'రాధే' అనే టైటిల్ తో ఈ సినిమా తెరకెక్కనుంది. ఈ సినిమాకు క్యాప్షన్ 'యువర్ మోస్ట్ వాంటెడ్ భాయ్'. 

వచ్చే ఏడాది ఈద్ కు ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చేలా చిత్ర యూనిట్ ప్లాన్ చేసుకున్నారు. ప్రభుదేవా దర్శకత్వంలో సల్మాన్ నటించడం ఇది మూడవసారి. అందుకనే ఈ కాంబినేషన్ లో వస్తున్న కొత్త సినిమా మీద అంచనాలు బాగానే ఉన్నాయి. ప్రభుదేవా - సల్మాన్ కాంబినేషన్ లో తెరకెక్కిన మొదటి సినిమా 'వాంటెడ్'..మహేష్ బాబు - పూరి జగన్నాధ్ కాంబినేషన్లో తెరకెక్కిన 'పోకిరి' కి రీమేక్ అన్న సంగతి తెలిసిందే. హిందీలో కూడా బ్లాక్ బస్టర్ గా నిలిచింది. ఆ సినిమా తర్వాత 'దబాంగ్ 3' చేస్తున్నారు. అయితే సల్మాన్ తమ్ముడు అర్బాజ్ దర్శకత్వంలో తెరకెక్కిన 'దబాంగ్ 2' బాగా నిరాశపరిచింది. 

స్టొరీ లేకుండా చుల్ బుల్ పాండే పాత్రతో మ్యాజిక్ చేద్దామనుకుంటే డిజాస్టర్ గా మిగిలింది. 'దబాంగ్ 3' ప్రకటించినప్పుడు కూడా కొందరు ప్రేక్షకుల్లో ఇదే అనుమానం. కథ లేకుండా ఒక హీరో పాత్రతో ఎలా నెట్టుకొస్తారో అని అన్నారు. ఈ కొత్త సినిమా టైటిల్ 'రాధే'. క్యాప్షన్.. 'యువర్ మోస్ట్ వాంటెడ్ భాయ్'. ఈ రాధే 'హాఫ్ గుడ్.. ఫుల్లీ మ్యాడ్' అని పాత్ర గురించి కొంత ఇంట్రో ఇచ్చారు. మరి ఈ సినిమా దబాంగ్ లాగా బ్లాక్ బస్టర్ అవుతుందా లేక దబాంగ్ 2 లాగా డిజాస్టర్ అవుతుందా అని కొందరు నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. ఏదేమైనా 'రాధే' ఫస్ట్ లుక్ మాత్రం అదిరిందని అంటున్నారు సల్మాన్ ఫ్యాన్స్. 


మరింత సమాచారం తెలుసుకోండి: