టాలీవుడ్ లో  సమంత క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఏ మాయ చేసావే సినిమాతో అక్కినేని హీరో నాగచైతన్య తో జోడీ కట్టి  తెలుగు ప్రేక్షకులందరినీ మాయ చేసింది సమంత . ఇక నాగచైతన్యను  కూడా తన మాయలో పడేసి  పెళ్లి చేసుకుంది. అయితే తన కెరియార్ లో  విభిన్నమైన పాత్రలు చేస్తూ అంచలంచలుగా ఎదిగింది సమంత. పెళ్లికి ముందు ఎన్నో గ్లామర్ పాత్రలో స్టార్ హీరోల సరసన మెరిసింది ఈ అమ్మడు. పెళ్లి తర్వాత గ్లామర్ పాత్రలకు పుల్ స్టాప్ పెట్టి... నటనకు ప్రాధాన్యం ఉన్న పాత్రలు మాత్రమే చేసుకుంటూ పోతుంది. భిన్నమైన పాత్రలను  ఎంచుకుంటూ తనలోని నటిని ప్రతి సినిమాలో కొత్తగా నిరూపించుకుంది. 



 ప్రస్తుతం ఉన్న హీరోయిన్ అందరికీ ఇన్స్పిరేషన్ గా  మారుతుంది సమంత ... ఒక్కమాటలో చెప్పాలంటే టాలీవుడ్ లేడీ సూపర్ స్టార్ గా మారింది సమంత. ఇప్పటికే వరుస సినిమాలతో దూసుకుపోతుంది.అయితే పెళ్లి తర్వాత ఈ అమ్మడికి లక్కు  బాగా కలిసి వస్తుంది. చేసిన ప్రతి సినిమా భారీ విజయాన్ని అందుకుంటుంది. అయితే సమంత నాగచైతన్య ఏ  స్టేజి మీద కనిపించిన సెంటరాఫ్ ఎట్రాక్షన్ గా మారిపోతారు.  ఫన్నీ కన్వర్జేషన్ చేస్తూ అందరిని అలరిస్తుంటారు . అయితే తాజాగా సమంత ఓ కార్యక్రమంలో  తన బెడ్ రూమ్ విషయాలను బయటకు తెలిపింది . తాజాగా మంచు లక్ష్మి వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్న ఫీట్ అప్ విత్ స్టార్స్  అనే కార్యక్రమంలో పాల్గొన్నది  సమంత... ఈ షో లో  స్టార్స్ తమ పర్సనల్ విషయాలను వెల్లడిస్తుంటారు . అయితే తాజాగా ఈ కార్యక్రమంలో పాల్గొన్న సమంత కూడా తమ బెడ్ రూమ్  విషయాలను బయటపెట్టింది. 



 ఈ కార్యక్రమంలో పలు ఆసక్తికర ప్రశ్నలను  సమంతని అడిగింది మంచు లక్ష్మి . ఇందులో పెళ్లికి ముందు డేటింగ్ కి సంబంధించిన ప్రశ్న  కూడా ఉంది. అయితే సమంత నాగ చైతన్య కి తమ బెడ్ రూమ్ లో ఎలా ముద్దు  పెడుతుందో అభిమానులకు తెలిపింది. తమ బెడ్ రూమ్ లో నాగచైతన్య కు తాను  రెండో భార్య అని చెప్పింది సమంత  .  చైతూ మొదటి భార్య బెడ్ మీద ఉండే పిల్లోలని చెప్పింది సామ్ . తాను నాగ చైతన్య ని ముద్దు పెట్టాలన్నా కూడా చైతూ పిల్లోలని  అడ్డుపెడతాడని   తెలిపింది సమంత. అయితే  ఎప్పుడు కూల్ గా  కనిపించే నాగచైతన్యకు చాలా కోపం ఉంటుందని వెల్లడించింది సమంత.


మరింత సమాచారం తెలుసుకోండి: