నట సింహం  నందమూరి బాలకృష్ణ  ప్రస్తుతం  కె.ఎస్.రవికుమార్ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే.  కాగా  ఈ చిత్రం  ఇప్పటికే పోస్ట్ ప్రొడక్షన్ పనులను ప్రారంభించిన సంగతి తెలిసిందే.  కాగా తాజాగా సినీ వర్గాల సమాచారం ప్రకారం  మేకర్స్ రేపు ఈ సినిమాకి సంబంధించి  ప్రత్యేక ప్రకటన చేస్తారట. మరి ఆ ప్రకటన ఏమిటో అని నెటిజన్లు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.  ప్రసుతం  ఈ చిత్రంలోని మాస్  సాంగ్ ను షూట్ చేస్తున్నట్లు  తెలుస్తోంది.  ఈ సాంగ్ లో   బాలయ్య - సోనాల్ చౌహాన్ పాల్గొంటున్నారు.  సాంగ్ లో మంచి రొమాంటిక్ బిట్స్ తో పాటు  మంచి డాన్స్ మూమెంట్స్ కూడా ఉంటాయట. మొత్తానికి బాలయ్య  ఈ వయసులో కూడా డాన్స్  చేయటానికి ఏ మాత్రం వెనుకాడటంలేదు.  ఎంతైనా మాస్  సాంగ్ లో  బాలయ్య రెచ్చిపోతాడు. గతంలో ఆయన చేసిన మాస్ సాంగ్స్ చూస్తే ఈ విషయం అర్ధమవుతుంది.   కాగా  బాలయ్య  ఈ చిత్రంలో రెండు భిన్నమైన పాత్రల్లో డిఫరెంట్ లుక్స్ లో  కనిపిస్తున్నాడు. 

అయితే ఇటివలే  బాలయ్య బాబు లుక్ కి సంబంధించిన ఫోటో  వైరల్ గా అయిన సంగతి తెలిసిందే.  డాన్ క్యారెక్టర్ కి సంబంధించిన  సరి కొత్త లుక్ లో బాలయ్య  అచ్ఛం ఐరన్ మాన్ లా ఉన్నాడు.  ఇక ఇటివలే ఈ సినిమాకి సంబంధించి విడుదల చేసిన  రెండు పోస్ట‌ర్స్‌  సోషల్ మీడియాలో  బాగా వైరల్ అయ్యాయి.   ఈ చిత్రంలో  రెండు భిన్నమైన పాత్రల్లో కనిపిస్తున్న బాలయ్య సరసన  సోనాల్ చౌహాన్ అండ్  వేదిక  హీరోయిన్లుగా  నటించనున్నారు.  అయితే  వేదిక  మధ్య వయస్సులో ఉండే బాలయ్య పాత్రకు జోడీగా కనిపించనుంది.  అలాగే ఓ కీలకమైన పాత్రలో  నమితను కనిపించనుంది.  నమితది  నెగటివ్ షేడ్స్ ఉన్న పాత్ర..  ముఖ్యంగా సినిమాలో  బాలయ్యకి విలన్ గా  కనిపించనుంది.  

ఇప్పటికే  సింహా సినిమాలో బాలయ్య సరసన నమిత నటించింది.  ఇక  ఈ చిత్రంలో విల‌క్ష‌ణ న‌టుడు జ‌గ‌ప‌తిబాబు  పవర్ ఫుల్ విల‌న్‌ గా న‌టించ‌బోతున్నాడు. `లెజెండ్‌` త‌ర్వాత బాల‌కృష్ణ‌, జ‌గ‌ప‌తిబాబు కాంబినేష‌న్‌లో ఈ చిత్రం రూపొందుతుంది.  ప్ర‌ముఖ సంగీత ద‌ర్శ‌కుడు చిరంత‌న్ భ‌ట్ సంగీత సార‌థ్యం వహిస్తున్నారు. ప్ర‌ముఖ నిర్మాత, సి.కె.ఎంట‌ర్‌ టైన్‌మెంట్స్ అధినేత సి.క‌ల్యాణ్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ సినిమాను డిసెంబర్ లో విడుదల చేయాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: