గత కొన్నాళ్లుగా సద్దుమణిగాయి అనుకుంటున్న మా అసోసియేషన్ వివాదాలు మరోసారి భగ్గుమన్నాయి. మా అధ్యక్షుడు నరేష్ కి  తెలియకుండానే... జనరల్ సెక్రటరీ అయిన జీవిత రాజశేఖర్ సమావేశం నిర్వహించడంతో  ఒక్కసారిగా మా అసోసియేషన్ వివాదాలు తారస్థాయికి చేరాయి. ఫ్రెండ్లీ మీటింగ్ అని చెప్పి బాడీ మీటింగ్ నిర్వహించారని పలువురు సభ్యులు అభ్యంతరం వ్యక్తం చేశారు. అయితే మా  అసోసియేషన్ సభ్యుల తీరు పై పలువురు తీవ్ర అసహనం వ్యక్తం చేసిన విషయం కూడా తెలిసిందే . అయితే మా అధ్యక్షుడు అయిన తనకు తెలియకుండా మా అసోసియేషన్ జనరల్  సెక్రటరీ గా  ఉన్న జీవిత రాజశేఖర్ మీటింగ్ నిర్వహించటం పై  మా అధ్యక్షుడు నరేష్ వ్యక్తం అభ్యంతరం వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. తనకు తెలియకుండా సమావేశం నిర్వహించడం పట్ల  ఆగ్రహం వ్యక్తం చేసిన నరేష్...  సమావేశం నిర్వహించిన వారిపై చర్యలు తీసుకోబోతున్నట్లు  చెప్పాడు. 

 

 

 

 అయితే నరేష్ వ్యాఖ్యలపై స్పందించిన మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఉపాధ్యక్షురాలు హేమ నరేష్ ని  నిలదీశారు. మా అధ్యక్షుడు నరేష్ తీరు అభ్యంతరంగా ఉంది అంటూ హేమ అన్నారు. గతంలో శివాజీ రాజా మా అధ్యక్షుడిగా ఉన్నప్పుడు నరేష్ జనరల్ సెక్రటరీగా ఉన్నారు. జనరల్ సెక్రటరీ హోదాలో మీటింగ్ పెట్టుకున్నారు నరేష్ . జనరల్ సెక్రటరీ హోదాలో తనకు మీటింగ్ పెట్టుకునేందుకు  అర్హత ఉంటుందని  తెలిపారు నరేష్. అప్పుడు జనరల్ సెక్రటరీ హోదాలో మీకు సమావేశం ఏర్పాటు చేయడానికి అధికారం  వున్నప్పుడు ప్రస్తుతం జీవిత రాజశేఖర్ కి ఎందుకు ఉండదు అని ప్రశ్నించారు హేమ

 

 

 

 అంతేకాకుండా నరేష్ మా అధ్యక్షుడిగా ఎన్నికైన తర్వాత మొదటి జనరల్ బాడీ మీటింగ్ లో చాలా గొడవలు జరిగాయని తెలిపారు. ఆ సమయంలో అధ్యక్షులు నరేష్  తమకు నచ్చిన వారిని మీటింగ్ తీసుకువచ్చారని. ఏం చేయాలనుకున్నారో అవన్నీ చెప్పారని ఆయన తెలిపారు. ఆ సమయంలో మా అధ్యక్షుడిగా ఉన్న నరేష్ తీరును చాలా  మంది సభ్యులు వ్యతిరేకించారని తెలిపారు. మా అసోసియేషన్ జనరల్ సెక్రటరీ అయిన జీవిత రాజశేఖర్ సభ్యులతో ఫ్రెండ్లీ  మీటింగ్ పెడితే మీకు  తప్పుగా అనిపిస్తుందా  అని ప్రశ్నించారు. అయితే తమ పై పరువునష్టం వేసేందుకు... మీటింగ్ కి సభ్యులు హాజరు కాకుండా మెసేజ్లు పంపి వారిని బెదిరించడానికి మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ అధ్యక్షుడు అయిన నరేష్ కి సమయం ఉంది కానీ... సమావేశానికి హాజరు కావడానికి మాత్రం సమయం  లేదా అంటూ నరేష్ తీరును ఎండగట్టారు మా ఉపాధ్యక్షురాలు హేమ. ఇప్పుడు వరకు మీపై  ఎంతో గౌరవంతో మాట్లాడుతున్నామని అదే సందర్భంలో ఎంతో గౌరవంతో పెట్టుకున్న మీటింగ్ గురించి కూడా వివరణ ఇస్తాము  అంటూ తెలిపింది హేమ .

మరింత సమాచారం తెలుసుకోండి: